అక్కినేని ప్రధానపాత్రలో తెరకెక్కిన '' మూవీ ఏప్రిల్ 2న విడుదల కాబోతోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహించారు. డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున కనిపించబోతున్నారు. దియా మీర్జా హీరోయిన్‌గా నటించగా.. సయామీ ఖేర్ కీలక పాత్ర పోషించారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో హీరో నాగార్జున మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తనకు ఎక్స్‌పరిమెంటల్ సినిమాలు చేయడమే ఇష్టమని చెప్పిన నాగార్జున ఎప్పుడూ కొత్త కథల వేటలోనే ఉంటానని అన్నారు. చేసిన పని మళ్లీ చేయటం తనకు ఇష్టముండదని, మూస ధోరణిలో వెళితే బోర్ కొడుతుందని చెప్పారు. కొత్త చిత్రాలు, కొత్త దర్శకులతో పని చేస్తున్నందు వల్లే యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉన్నానని నాగార్జున అన్నారు. మగాడంటే ఎలా ఉండాలని అనుకుంటామో ఈ చిత్రంలో తన పాత్ర అలాగే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏసీపీ విజయ్ వర్మ క్యారెక్టర్ నచ్చి ఈ సినిమా ఓకే చేశా. మగాడంటే ఇలా ఉండాలి అనేలా ఆయన క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాల్లో ఇదే స్ట్రాంగ్ క్యారెక్టర్. పక్కా కమర్షియల్ చిత్రమిది అని తెలిపిన నాగార్జున.. కరోనా గురించి మాట్లాడుతూ చిన్న వైరస్ ప్రపంచానికి బ్రేకులు వేసిందని అన్నారు. దేని గురించీ ఎక్కువగా ఆలోచించొద్దని మనకు నేర్పిందని, లాక్‌డౌన్ తర్వాత షూటింగ్ కోసం మనాలీ వెళ్లడం.. అలా బయట ప్రపంచంలోకి అడుగుపెట్టగానే ఆనందమేసిందని చెప్పారు. ఆ సమయంలో కళ్లలో నీళ్లు తిరిగాయంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా కోసం ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తూ పనిచేశానని నాగార్జున తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39kmKVN
No comments:
Post a Comment