నాచురల్ స్టార్ '' అనే మరో వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. 'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని- శివ నిర్వాణ కాంబినేషన్‌లో అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు. నాని కెరీర్‌లో 26వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్.. 'టక్ జగదీష్' పరిచయ వేడుక కార్యక్రమాన్ని రాజమండ్రిలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో నాని, చిత్ర డైరెక్టర్ శివ నిర్వాణ, హీరోయిన్లు రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన పలు విషయాలు షేర్ చేసుకుంటూ తమ సినిమాపై హైప్ పెంచుకున్నారు. టక్ జగదీష్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడుకున్న సినిమా అని తెలిపిన డైరెక్టర్ శివ నిర్వాణ.. రెండేళ్ల నుంచి ఈ కథకు సపోర్ట్ ఇస్తున్న నిర్మాతలకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. అందరి సపోర్ట్ ఉండటం వల్లే ఇంత పెద్ద క్యాస్టింగ్ ఉన్న సినిమాను కోవిడ్ తరువాత కూడా చేశానని, చిత్రంలో జగపతి బాబు- నానిలను అన్నాదమ్ములుగా చూడటం ఐ ఫీస్ట్‌లా ఉంటుందని అన్నారు. 'నిన్ను కోరి' సినిమాలో రెండు మూడు ఎమోషనల్ సీన్స్ ఉంటాయి.. కానీ ఇందులో ఎక్కువగా ఉంటాయని ఇంతకంటే సినిమా గురించి ఎక్కువగా చెప్పలేకపోతున్నానని తెలిపారు. 'కొందరికి కుల పిచ్చి ఉంటుంది.. కొందరికి డబ్బు పిచ్చి ఉంటుంది.. కానీ నాకు కుటుంబం అంటే పిచ్చి' అనేదే టక్ జగదీష్ సినిమా అని, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు డైరెక్టర్ శివ నిర్వాణ.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fmd29A
No comments:
Post a Comment