సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) ద్వారా ప్రభుత్వం ఎంతోమంది పేదలను ఆదుకుంటోంది. అవసరమైన వారికి ఆర్ధికంగా తోడు నిలుస్తూ ప్రాణాలను కాపాడుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ కమెడియన్, బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటిస్టెంట్ ముక్కు అవినాష్‌కు చెక్కు అందింది. ఈ విషయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కాళ్ళ లక్ష్మిరాజం (ముక్కు అవినాష్ తల్లి) అనారోగ్యానికి గురయ్యారు. దీంతో లక్ష్మిరాజం చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుండి 60 వేల రూపాయలు మంజూరు చేసింది తెలంగాణ గవర్నమెంట్. ఈ నగదుకు సంబంధించిన చెక్కును శనివారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో లక్ష్మిరాజం కుమారుడు ముక్కు అవినాష్‌కు మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేసి ఆ ఫొటోను సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇటీవల జరిగిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ముక్కు అవినాష్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అరియానా అతి, అవినాష్ అంతకు మించి అన్నట్లుగా యాక్షన్‌తో అప్పటికే ఉన్న పాపులారిటీని రెట్టింపు చేసుకున్నారు. అయితే బిగ్ బాస్ ముగిశాక పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న అవినాష్.. తన తల్లిపై ఉన్న ప్రేమను బయటపెట్టాడు. అమ్మ అంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sugLpf
No comments:
Post a Comment