నేడు (మార్చి 30) యంగ్ హీరో పుట్టినరోజు సందర్భంగా బెస్ట్ విషెస్ తెలుపుతూ ఆయన కొత్త సినిమా 'మ్యాస్ట్రో' ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ ఏడాది వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన నితిన్ ఇటీవలే 'చెక్' సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకొని ఆ వెంటనే 'రంగ్ దే' మూవీతో డీసెంట్ హిట్ అందుకొని ఆకర్షించారు. ఇక ఇప్పుడు 'మ్యాస్ట్రో' అంటూ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానే 'మ్యాస్ట్రో' అంటూ ఫస్ట్‌లుక్ బయటకు వదిలారు. ఇందులో నితిన్ అంధుడిగా కనిపించనుండటం విశేషం. కాగా, తాజాగా విడుదలైన ఈ పోస్టర్‌లో చేతిలో స్టిక్ పట్టుకొని నడుస్తున్న నితిన్ వెనకాలే రక్తపు మరకలు కనిపిస్తుండటంతో చిత్రంలో అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇకపోతే నితిన్ 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో ఆయన సరసన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్, మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా.. యాంకర్ శ్రీముఖి కీలక పాత్రలో కనిపించనున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితారెడ్డి నిర్మిస్తుండటం మరో విశేషం. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rAfADo
No comments:
Post a Comment