బిగ్ బాస్ నాల్గో సీజన్ పుణ్యాన కొన్ని ట్రాకులు బాగానే క్లిక్ అయ్యాయి. కొన్ని జంటలు స్నేహితుల్లా, ఇంకొన్ని అంతకు మించి అనేలా బంధాలు ఏర్పడ్డాయి. మొత్తానికి వారంతా బయటకు వచ్చాక కూడా తమ బంధాలను అలానే కొనసాగిస్తున్నారు. ఇంకా రచ్చ రచ్చ చేస్తున్నారు. కలిసి జంటలుగా సోషల్ మీడియాను ఊపేస్తోన్నారు. బిగ్ బాస్ ఇంట్లో , అవినాష్ చేసిన హల్చల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. బిగ్ బాస్ షోలో అరియానా అతి, అవినాష్ అంతకు మించి యాక్షన్, పులిహోర, ట్రాకులు కలపడం అందరికీ తెలిసిందే. తన అతితో జనాలను విసిగించినా సరే చివరి వరకు అరియానా పోరులో నిలిచారు. ఆమె ముక్కుసూటిదనం, ధైర్యం, తెగవ వంటి లక్షణాలు అందరికీ నచ్చాయి. మితి మీరిన అతి ఉన్నా కూడా జనాలు మాత్రం ఆమెకు కొన్ని లక్షణాలను చూసి చివరి వరకు ఉంచారు. ఇక అవినాష్ మాత్రం తనది తాను ఎంటర్టైనర్ అనే ట్యాగ్ ఇచ్చి కాస్త ఓవర్ యాక్షన్ చేయడంతో మధ్యలోనే పంపించేశారు. టాప్ 5 కంటెస్టెంట్‌గా ఉండే అర్హత కలిగినవాడే.. కానీ తన చేష్టలతో ముందుగానే ఆట నుంచి విరమించుకోవాల్సి వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో అవినాష్ కలిపిన పులిహెర, అతని ట్రాకుల గురించి అందరికీ తెలిసిందే. చివరకు అరియానా అవినాష్ ట్రాక్ మాత్రం బాగానే క్లిక్ అయింది. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని అరియానా, అవినాష్ క్లారిటీ ఇచ్చారు. కానీ ఆన్ స్క్రీన్‌లొ మాత్రం ఈ మధ్య రెచ్చిపోతున్నారు. ఇక ఓపెనింగ్స్, ప్రకటనల్లో మాత్రం ఈ ఇద్దరూ జంటగానే కనిపిస్తున్నారు. ఈ మధ్యే అరియానా కాస్త కుదుటపడింది. ఆరోగ్యం బాగా అవ్వడంతో ప్రిన్సెస్ ఈజ్ బ్యాక్ అంటూ అవినాష్ తెగ సంబరపడిపోయాడు. వీకెండ్ స్పెషల్‌గా అరియానా, అవినాష్ ఇద్దరూ కూడా ఫాంహౌస్‌కు వెళ్లారు. మామిడి తోటలో బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు. సిటీ పరిసర ప్రాంతాల్లోని ఈ ఫాం హౌస్‌లో రాత్రంతా రచ్చ చేసినట్టు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి ఓ హోటల్ ప్రారంభోత్సవానికి సిద్దమైనట్టు కనిపిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39mDb49
No comments:
Post a Comment