మెగా పవర్ స్టార్ జోష్ మామూలుగా లేదండోయ్. ఓ వైపు తన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ RRR చేస్తూనే మరోవైపు ఇతర ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. హీరోగా, నిర్మాతగా మెగా అభిమానులను ఫిదా చేస్తున్నారు. ప్రెసెంట్ రాజమౌళి రూపొందిస్తున్న RRRతో పాటు తండ్రి చిరంజీవితో కలిసి 'ఆచార్య' మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్న చెర్రీ.. మరికొద్ది రోజుల్లో పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ మూవీని నిర్మించనున్నారు. చెర్రీ కెరీర్‌లో 15వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాపై శంకర్ సీరియస్ స్కెచ్ వేస్తున్నారనేది లేటెస్ట్ టాక్. భారీ బడ్జెట్ కేటాయించి దిల్ రాజు ఈ మూవీ తెరకెక్కించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ 50వ చిత్రంగా రానున్న నేపథ్యంలో అత్యంత స్పెషల్‌గా ఉండాలని ఆయన డిసైడ్ అయ్యారట. ఈ మేరకు ఎప్పటికప్పుడు దర్శకుడు శంకర్‌తో డిస్కషన్స్ చేస్తూ ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారట. అలాగే ఈ ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం చెన్నైలో ప్రత్యేకంగా కొత్త ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నారట దిల్ రాజు. అన్ని వసతులతో కుడి చిత్రయూనిట్ మీట్ కావడానికి, సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ పెట్టుకోవడానికి అనువుగా ఉండేలా ఈ ఆఫీస్ డిజైన్ చేయిస్తున్నారని సమాచారం. ఇకపోతే తన నాచురల్ జానర్ పొలిటికల్ నేపథ్యంలోనే ఈ సినిమా కథను కూడా రాసుకున్నారట శంకర్. భారీ విజువల్ వండర్‌గా ఈ సినిమాని రూపొందించాలని, చెర్రీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ కావాలని ఆయన ఫిక్సయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ యంగ్ చీఫ్ మినిస్టర్‌గా కనిపిస్తారనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. చరణ్‌కు జోడీగా మరోసారి బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ నటించనుందని తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే ఈ మూవీ వీర లెవల్‌లో ఉంటుందని అర్థమవుతోంది కదూ!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ctLNI1
No comments:
Post a Comment