సెలబ్రిటీలన్నాక లగ్జరీకి పెద్ద పీట వేయడం కామనే అయినా ఈ మధ్యకాలంలో అది మరీ ఎక్కువైంది. విలాసవంతమైన భవనాలు కొనుగోలు చేయడం, లగ్జరీ కార్లలో తిరగడం, ఖరీదైన క్యారవాన్స్ మెయిన్‌టైన్ చేయడం లాంటివి చేస్తున్నారు నేటితరం హీరోహీరోయిన్లు. ఈ నేపథ్యంలో ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ఖరీదైన కారు కొనేయగా.. తాజాగా అంతకుమించి అన్నట్లుగా యంగ్ రెబల్ స్టార్ కొనేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వివరాలు ఇండియన్ వైడ్ ట్రెండ్ అవుతుండటం విశేషం. మామూలుగా ప్రభాస్‌కు కార్లంటే మహా ఇష్టం. ఇప్పటికే ఆయన దగ్గర BMW 520D, ఇన్నోవా క్రిస్టా, జగువార్ ఎక్స్‌జేఎల్, రేంజ్ రోవర్ వోగ్, రోల్స్ రాయ్స్ గోస్ట్ కార్లు ఉన్నాయి. అంతటితో ఆగక కార్లపై ఉన్న మోజుతో మరో కొత్త కారు కొన్నారు. లంబోర్ఘిని అవెన్‌టోడోర్ ఎస్ రోడ్‌స్టర్‌ను ప్రభాస్ సొంతం చేసుకున్నారని, అది నిన్న (ఆదివారం) సాయంత్రం డెలివరీ అయిందని తెలిసింది. ఇది ఇండియాలో రెండోదని.. సక్సెస్‌ఫుల్‌గా డెలివరీ చేసేశామని ఆ కారుకు చెందిన సంస్థ తెలిపింది. సుమారుగా ఈ లగ్జరీ కారు విలువ అన్ని టాక్సులతో కలుపుకొని 7 కోట్లు ఉంటుందని బిజినెస్ వర్గాలు చెబుతున్న మాట. అత్యాధునిక ఫీచర్స్‌తో ఈ కారు నడుస్తుందని, ఇప్పటికే ప్రభాస్ దీనిపై చెక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. రెబల్ స్టార్ కొనుగోలు చేసిన ఈ కారును చూసి మురిసిపోతున్న ఆయన ఫ్యాన్స్.. పాన్ ఇండియా స్టార్ 'బాహుబలి' రేంజ్ అంటే ఇదీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవలే 'రాధేశ్యామ్' షూటింగ్ ఫినిష్ చేసిన ఆయన.. ''ఆదిపురుష్, సలార్'' సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ రూపొందనుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rAowbM
No comments:
Post a Comment