స్టార్ హీరోల అభిమానులు ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. ఫ్యాన్స్ వార్ సోషల్ మీడియాలో ఎంతటి వివాదానికి దారి తీస్తుంటాయో నిత్యం చూస్తుంటాం. అయితే వీటి గురించి నిన్న తన 'టక్ జగదీష్' పరిచయ వేడుకలో సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. నేను వారిలా ఫ్యాన్స్‌ను ఎంకరేజ్ చేయను అంటూ కొత్త వివాదానికి దారి తీశాడు. ఇప్పుడు నాని ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నారా? అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. రాజమండ్రిలో నిన్న సాయంత్రం జరిగింది. మొదటిసారిగా ఇలాంటి ఓ వేడుకను నిర్వహించారు. టక్ జగదీష్ ఫ్యామిలీని తెలుగు ప్రేక్షకులను పరిచయం చేయడానికి ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. ఇక సినిమాలోని ప్రతీ పాత్ర, ఆ పాత్రల స్వభావం, వాటితో తనకుండే బంధం గురించి నాని వివరించారు. తన ప్రసంగంలో మధ్యలోనే నాని టక్ జగదీష్ కుటుంబాన్ని అందరికీ పరిచయం చేశారు. నాని మామూలుగానే ఫ్యాన్స్ ట్వీట్లకు రియాక్ట్ అవ్వరు. ఫ్యాన్స్‌తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వరు. అయితే గత వారం రోజులుగా నాని రాజమండ్రిలోనే షూటింగ్ చేస్తున్నారట. 'శ్యామ్ సింఘరాయ్' సినిమా కోసం వారం నుంచి రాజమండ్రిలోనే ఉన్నారట. అయితే ఓ సారి షూటింగ్ స్పాట్‌కు వెళ్తుంటే.. అక్కడ అందరూ ఉన్నారు. అందులోంచి ఒకతను మాత్రం.. ‘నేను మీకు వీరాభిమానిని.. మీరు నాతో సెల్ఫీ దిగకపోతే.. మిమ్మల్ని షూటింగ్ చేసుకోనివ్వను’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అలా వార్నింగ్‌ను కూడా ప్రేమతో ఇవ్వడం కేవలం ఈ రాజమండ్రి వాళ్లతోనే సాధ్యమవుతుందని నాని చెప్పుకొచ్చారు. అయితే తాను మాత్రం ఫ్యాన్స్‌ను సెల్పీలు, ఫ్యాన్స్ వార్ అంటూ అలాంటి వాటిని ఎంకరేజ్ చేయనని అన్నారు. మా అమ్మానాన్ననలు నన్ను చూసి గర్వ పడుతుంటారు. అభిమానులు నన్ను చూసి గర్వపడేలా చేస్తాను అని అన్నారు. ఇప్పుడు చూసే వాళ్లకు చిన్న చిన్న ఇటుకలే కనిపిస్తాయి.. త్వరలోనే ఓ పెద్ద గోడ కనిపిస్తుంది.. మీ అభిమానం ఉంటే ఎప్పుడూ ఇలానే ఉంటాను అని నాని అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 23న రాబోతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3swTanE
No comments:
Post a Comment