కరోనా వైరస్ విజృంభణ, లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కేసిన సంగతి తెలిసిందే. గతేడాది జులై 26వ తేదీన హీరో ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి షాలిని కందుకూరి మెడలో మూడు ముళ్ళేసి ఆమెలో సగభాగం అయ్యాడు. అప్పటినుంచి షాలినితో సరదాగా గడుపుతూనే వరుస సినిమాలు చేస్తున్న నితిన్.. పెళ్లి తర్వాత మొదటి పుట్టినరోజు వేడుక చేసుకున్నారు. నేడు (మార్చి 30) నితిన్ బర్త్ డే కావడంతో గత రాత్రి తన ఫ్యామిలీ, అత్యంత సన్నిహితులతో ఆయన పుట్టినరోజు వేడుక జరుపుకున్నారని తెలుస్తోంది. కోవిడ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేవలం అత్యంత సన్నిహితుల మధ్య నితిన్ పుట్టినరోజు వేడుక జరుపుకున్నారట. ఈ వేడుకకు తన భర్తతో కలిసి హాజరు కావడం విశేషం. ఈ నవ దంపతులు అంతా కలిసి బర్త్ డే వేడుకలో చిల్ అయ్యారు. నితిన్ ఇంట్లోనే జరిగిన ఈ వేడుకలో సునీత భర్త రామ్ వీరపనేని ఫుల్ ఎంజాయ్ చేశారట. అనంతరం ఈ రెండు జోడీలు కలిసి కెమెరా ముందు పోజులిచ్చాయి. దీంతో నవ దంపతుల రొమాంటిక్ ఫ్రేమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నితిన్ బర్త్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. కాగా, సునీత భర్త రామ్‌తో నితిన్‌కి సన్నిహిత సంబంధాలున్నాయని గతంలోనే విన్నాం. పైగా సునీత- రామ్ వెడ్డింగ్ ఈవెంట్‌లో కూడా తన భార్య షాలినితో కలిసి రచ్చ చేశారు నితిన్. మళ్ళీ ఇప్పుడు ఓ స్పెషల్ డే సందర్భంగా ఈ రెండు జోడీలు కలవడం చూస్తుంటే వీరి మధ్య స్నేహబంధం ఎంత గట్టిదనేది తెలిసిపోతోంది. ఇక నితిన్ కెరీర్ అంటారా.. జయాపజయాలను పక్కనబెట్టి వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ జోష్‌లో ఉన్నాడు. ఇటీవలే ''చెక్, రంగ్ దే'' సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన జూన్ నెలలో తన లేటెస్ట్ ప్రాజెక్టు 'మాస్ట్రో'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wdc2dC
No comments:
Post a Comment