ఈ మధ్యకాలంలో తెలుగు తెరపై బాలీవుడ్ హీరోయిన్స్ హవా బాగా నడుస్తోంది. బీ టౌన్‌లో ఫేమస్ అయిన హీరోయిన్స్‌పై తెలుగు దర్శకనిర్మాతలు కన్నేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యంగ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు ఒకేసారి ఇద్దరు బడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కిందని తెలుస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. మెగాస్టార్ , నందమూరి నటసింహం అప్‌కమింగ్ సినిమాల్లో హీరోయిన్‌గా సోనాక్షిని సెలక్ట్ చేశారనేది లేటెస్ట్ టాక్. సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ సినిమాల పరంగా యమ జోష్‌లో ఉన్నారు. కుర్ర హీరోలకు గట్టిపోటీ ఇస్తూ వరుస సినిమాలకు కమిటవుతున్నారు. బడా హీరోలు కావడంతో వీరి సరసన నటించాల్సిన హీరోయిన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. ఈ క్రమంలో చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా కోసం సోనాక్షిని సంప్రదించారని తెలుస్తోంది. అదేవిధంగా బాలకృష్ణ- గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రానున్న మూవీలోనూ సోనాక్షినే ఫైనల్ చేయాలని చూస్తున్నారట. ఈ రెండు ఆఫర్స్ సోనాక్షి వరకు చేరాయని, డేట్స్ విషయంలో ఆమె ఆలోచన చేస్తోందని ఇప్పటివరకు అందిన సమాచారం. ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మే నెల 14వ తేదీన గ్రాండ్‌గా విడుదల కానుంది. బాలకృష్ణ విషయానికొస్తే.. బోయపాటితో హాట్రిక్ మూవీ BB3 చేస్తున్నారు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. ఈ మూవీ కూడా మే నెలలోనే విడుదల కానుండటం విశేషం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QzLXFz
No comments:
Post a Comment