సీనియర్ హీరో, నటుడు అర్జున్ సర్జాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ‘‘ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వెంటనే నేను తగిన చర్యలు తీసుకుని ఐసోలేషన్‌కి వెళ్లాను. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారు, నా దగ్గరి వాళ్లు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బావుంది. జాగ్రత్తగా ఉండండి.. మాస్కుల ధరించడం మరచిపోకండి’’ అని మెసేజ్ చేశారు అర్జున్. అర్జున్ సర్జా విషయానికి వస్తే కన్నడ నటుడైనప్పటికీ అర్జున్‌కు తెలుగు, తమిళ చిత్ర సీమలతో మంచి అనుబంధం ఉంది. దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఆయన చాలా చిత్రాలను చేశారు. హీరోగా పలు చిత్రాల్లో నటించిన ఆయన నిర్మాతగా కూడా మారారు. అలాగే దర్శకుడిగా మారి జైహింద్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని కూడా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కూడా వైవిధ్యమైన పాత్రలను చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా చేస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో అర్జున్ విలన్‌గా నటించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఆంజనేయ స్వామి భక్తుడు. చెన్నై విమానాశ్రయానికి సమీపంలోని తన సొంత స్థలంలో ఆంజనేయస్వామి గుడిని కట్టించిన తన భక్తిని చాటుకున్నారు. రీసెంట్‌గా శ్రుతి హారిహారన్ లైంగిక వేధింపుల కేసు నుంచి కూడా అర్జున్‌కి ఊరట లభించింది. ఎలాంటి ఆధారాలు దొరకలేదని పోలీసులు కోర్టుకి చెప్పారు. ప్రస్తుతం ఈయన తెలుగులో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m5hNGO
No comments:
Post a Comment