వివాదాస్పద వీరుడు రూటే సపరేటు. ఎవరేమనుకుంటే నాకేంటి నాకు నచ్చింది చేస్తా.. నచ్చినట్లు జీవిస్తా అనేది మనోడి ప్రధాన సూత్రం. ఈ క్రమంలోనే చాలా సందర్బాల్లో వర్మపై విమర్శలు సైతం వచ్చాయి. అయినప్పటికీ అవేవీ లెక్కచేయకుండా తన దారి తనదే అన్నట్లుగా దూసుకుపోతున్నారు ఆర్జీవీ. ఇదంతా పక్కనబెడితే సడెన్‌గా బుల్లితెరపై కనిపించి ఏకంగా ఇంద్రజపై కన్నేశారు వర్మ. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాంట్రవర్సీ అనే పదాన్ని తన పేరుకు పర్యాయపదంగా మార్చుకున్న ఆర్జీవీ గతంలో ఇయన సుల్తానా, నటి జ్యోతితో చేసిన రచ్చ గురించి మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరితో కలిసి చిందేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆ వీడియోలు నేటికీ సోషల్ మీడియాలో ఎక్కడో చోట కనిపిస్తూనే ఉన్నాయి. ఇంతలో ఆర్జీవీ- ఇంద్రజకు సంబంధించిన మరో వీడియో నెట్టింట హంగామా చేస్తోంది. అచ్చం ఎప్పటిలాగే తన చురుకైన చూపులతో ఇంద్రజను ఉక్కిరిబిక్కిరి చేశారు వర్మ. ఈ ఏడాది చివరి రోజున కొన్న సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 'పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు' అనే స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేశారు. ఈ ప్రోగ్రాం కోసం రామ్ గోపాల్ వర్మను స్పెషల్ గెస్ట్‌గా తీసుకొచ్చి , రష్మి, లాస్య, జబర్దస్త్, ఢీ కంటెస్టెంట్‌లతో స్టెప్పులేయించారు. డిసెంబర్ 31న ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ కానుండగా తాజాగా ప్రోమో రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ వీడియోలో ‘నేను మీ అందరినీ పెళ్లి చేసుకోవచ్చా?’ అని అడుగుతూ వేదికపై ఉన్న బ్యూటీలందరి ముందు తన కోరిక బయటపెట్టారు వర్మ. చివర్లో సమంత ఐటెం సాంగ్ ప్లే అవుతుండగా ఇంద్రజను కసిగా చూస్తూ పిచ్చెక్కించారు వర్మ. సో.. చూడాలి మరి ఈ షోలో ఆర్జీవీ ఎంతలా రెచ్చిపోతారనేది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3IMavlc
No comments:
Post a Comment