ఇటీవలే 'లవ్ స్టోరీ' సినిమాతో సక్సెస్ అందుకున్న యంగ్ హీరో నాగ చైతన్య.. ప్రస్తుతం తన తండ్రి నాగార్జునతో కలిసి '' సినిమాలో నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున- కళ్యాణ్ కృష్ణ కురసాల కాంబోలో గతంలో వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వల్‌గా రాబోతున్న ఈ మూవీలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. జంటగా ఉప్పెన ఫేమ్ నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పల్లెటూరి బుల్లోడుగా నాగార్జున సందడి చేయనుండగా, ఆయన వారసుడిగా నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న దర్శకనిర్మాతలు.. వరుస అప్‌డేట్స్ ఇస్తూ చిత్ర ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇందులో భాగంగా తాజాగా నాగ చైతన్య లవ్ యాంగిల్ తెలిపేలా ''నా కోసం'' లిరికల్ సాంగ్ టీజర్ రిలీజ్ చేశారు. నా కోసం మారావా నువ్వు.. లేక నన్నే మార్చేశావా నువ్వు అంటూ మెలోడియస్ ట్యూన్‌తో సాగిపోతున్న ఈ పాటను నాగ చైతన్య- కృతి శెట్టిలపై షూట్ చేశారు. తనదైన స్టైల్‌లో సిద్ శ్రీరామ్ ఆలపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఫీల్ గుడ్ ఫీలింగ్ తెప్పిస్తోంది. సెంబర్ 5వ తేదీన సాయంత్రం 5 గంటల 12 నిమిషాలకు ఈ సాంగ్ పూర్తి వీడియోను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు మేకర్స్. నాగార్జున సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగలక్ష్మి పాత్రలో కృతి శెట్టి కనిపించనుంది. రీసెంట్‌గా విడుదల చేసిన ఆమె లుక్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dhK7kt
No comments:
Post a Comment