డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న '' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ వార్తల్లో నిలిచింది. ఈ సినిమాను చాలా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్న పూరి జగన్నాథ్.. ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నారట. ఇందుకోసం ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో భాగమవుతున్నట్లు ప్రకటించిన పూరి.. ఇందులో బాలకృష్ణను కూడా భాగం చేశారనే టాక్ బయటకొచ్చింది. ఇదే ఈ సినిమాలో పెద్ద ట్విస్ట్ అంటున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమాలో ఎంతో కీలకమైన ఓ చిన్న రోల్ చేయించారని సమాచారం. ఈ పాత్ర నిడివి 5 నిమిషాలకు మించి ఉండదని అంటున్నారు. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్’ మూవీ చేశారు. అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ చనువుతోనే లైగర్‌లో ఓ ఐదు నిమిషాల రోల్ చేయమని అడిగారట పూరి. దానికి బాలయ్య ఓకే చెప్పారని, ఆ కారణంగానే గతంలో లైగర్ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ సెట్స్ మీదకు ఆయన రావడం జరిగిందనే టాక్ నడుస్తోంది. సో.. చూడాలి మరి ఇందులో నిజమెంత వరకు ఉందనేది!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Epc9qg
No comments:
Post a Comment