Sukumar : శ్రీమతిపై ప్రేమను కురిపించిన డైరెక్టర్.. ఎంతైనా సుకుమార్ కవిత్వం వేరే లెవెల్!

రైటింగ్‌ను ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. ఆయన రాసే ప్రతీ మాటలోనూ ఓ లాజిక్ ఉంటుంది. మామూలుగా అయితే లాజిక్ ఉంటేనే సుకుమార్ రాస్తారు. ఆయన సినిమాల్లోని కథ, కథనం, మాటలు అన్నీ కూడా భిన్నంగా ఉంటాయి. ఇక ఆయన తనలోని భావాన్ని పేపర్ మీద పెడితే అక్షరాల ప్రవాహాం వెల్లువెత్తాల్సిందే. అలా సమయానుగుణంగా సుకుమార్ చెప్పే కవిత్వాలు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటాయి. సుకుమార్ సతీమణి తబిత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. సుకుమార్ వ్యక్తిగత జీవితం, పిల్లల గురించి తబిత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఆ మధ్య పుష్ప సెట్‌లోనూ తబిత సందడి చేశారు. తన పిల్లలకు ఏదో చెబుతున్న సుకుమార్ ఫోటోను తబిత షేర్ చేయగా అది వైరల్ అయింది. అయితే నేడు సుకుమార్ తబితల వివాహా దినోత్సవం. పన్నేండెళ్ల వివాహా మహోత్సవాన్ని పురస్కరించుకుని సుకుమార్ తనలోని భావాలను బయటపెట్టేశారు. తన భార్యకు అందమైన కవిత్వాన్ని చెప్పి అర్దాంగి అసలు అర్దాన్ని అందరికీ చెప్పేశారు. ‘నేనెప్పుడూ సగాన్నే.. నువ్వు రాక ముందు పూర్తికాని సగాన్ని.. నువ్వు వచ్చాక పూర్తయిన సగాన్ని.. నేను పూర్తికావడమంటే నీ సగమవ్వడమే కదా.. నా సగానికి పూర్తి ప్రేమతో వివాహా దినోత్సవ శుభాకాంక్షలు -సుకుమార్’ని చెప్పుకొచ్చారు. ఇక సుకుమార్ చెప్పిన కవిత్వానికి తబిత ఫిదా అయ్యారు. ‘నేను ఎంతో ఫీలయ్యేలా ఇలా గొప్పగా చెప్పే మాటలే నన్ను ఆకట్టుకుంటాయి.. అదే నీకున్న సూపర్ పవర్.. ఇలా నువ్వు చెప్పే మాటలు నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఈ మాటలకే నేను పడిపోయాను.. నిన్ను ప్రేమిస్తున్నాను.. పెళ్లి రోజు శుభాకాంక్షలు’ అని పోస్ట్ చేశారు. సుకుమార్‌తో ఉన్న మెమోరీస్‌ను పోస్ట్ చేస్తూ.. నీతో ఉన్న ప్రతీ క్షణం ఓ అందమైన జ్ఞాపకం, ప్రతీ అనుభవం ఓ అద్భుతం, నా జీవితంలోకి నువ్ రావడమే గొప్ప అదృష్టం, ఇంతకంటే ఏమీ కోరుకోలేను. పన్నేండేళ్ల బంధం.. నా సగభాగంగా ఉన్నందుకు థ్యాంక్స్ అంటూ ప్రేమను కురిపించారు తబిత.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cB9Pkc

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts