సినీ ఇండస్ట్రీలో డబ్బు వ్యవహారాలు ఎప్పుడూ కూడా వివాదాలకు దారి తీస్తుంటుంది. నిర్మాత, హీరోకు మధ్య హీరోకు దర్శకుడికి మద్య, దర్శకుడు నిర్మాత మధ్య ఇలా ఎవరో ఒకరి మధ్య ఎప్పుడూ కాంట్రవర్సీలు క్రియేట్ అవుతూనే ఉంటాయి. రెమ్యూనరేషన్ ఇచ్చారనో, తక్కువ ఇచ్చారనో, ఇంకా ఎగ్గొట్టారనే నెపంతో వాగ్వాదాలకు దిగుతుంటారు. చివరకు కేసులు, కోర్టులు అంటూ తిరుగుతారు. అలా రెమ్యూనరేషన్ విషయం ఒకలా ఉంటే.. ఇండస్ట్రీలో జరిగే లావాదేవీలు, అప్పులు, ఫైనాన్స్ సంగతి మరోలా ఉంటుంది. తాజాగా విశాల్‌కు ఇలాంటి ఓ ఘటనే ఎదురైంది. తన సినిమాలను తానే నిర్మించుకుంటారన్న సంగతి తెలిసిందే. అలా తన ఇరుంబుతిరై( అభిమన్యుడు) అనే సినిమా కోసం కొంత డబ్బు కావాల్సి వచ్చిందట. ఆ సమయంలో విశాల్‌కు నిర్మాత ఆర్బీ చౌదరీ, మరో వ్యక్తి సాయం చేశారట. డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లు రాసుకుని డబ్బును సమకూర్చారట. ఈ క్రమంలో విశాల్ డబ్బును తిరిగి చెల్లించినా కూడా డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లను మాత్రం తిరిగి ఇవ్వలేదట. ఇక చూసీ చూసీ విసుగుచెందిన విశాల్ పోలీసు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మాట్లాడుతూ.. 'ఇరుంబు తిరై' అనే చిత్ర షూటింగ్ సమయంలో డబ్బు అవసరమైతే నేను, తిరుప్పూర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి విశాల్‌కు అప్పుగా ఇచ్చాం. అప్పు తీసుకున్న సమయంలో విశాల్ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేసి ఇచ్చాడు. ఆ తర్వాత విశాల్ తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. ఈ విషయాన్ని కూడా మేము ఓ డాక్యుమెంట్స్‌పై రాసి సంతకాలు పెట్టాం. ఆ డాక్యుమెంట్స్ దర్శకుడు శివకుమార్ దగ్గర దాచాము. అయితే, శివకుమార్ ఆకస్మిక మరణంతో ఆ కాగితాలు ఎక్కడ దాచారో మాకు తెలియలేదు. దాంతో మేము వాటిని విశాల్‌కు తిరిగి ఇవ్వలేకపోయాం. అదే విషయాన్ని ఆయనతో చెప్పాం. కానీ వినిపించుకోలేదు. ఆ డాక్యుమెంట్స్ మా దగ్గరే ఉన్నాయని.. వాటితో మేము ఏదైనా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని విశాల్ భయపడుతున్నారు. నిజంగానే ఆ డాక్యుమెంట్స్ మా వద్ద లేవు. ఇప్పుడు ఈ సమస్యే కోలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోందని అన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gj8AZe
No comments:
Post a Comment