సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలతో స్పీడ్ పెంచారు పవర్ స్టార్ . రీసెంట్‌గా 'వకీల్ సాబ్' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం తన తదుపరి సినిమాల షూటింగ్స్ ఫినిష్ చేస్తూ వస్తున్నారు. అందులో ఒకటే మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్. ఇందులో పవన్‌తో రానా తెరపంచుకోబోతున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తుండగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ వైరల్ అవుతోంది. కథ, కథనాలతో పాటు సాంగ్స్‌కి కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నారు నేటితరం ప్రేక్షకులు. రీసెంట్‌గా తమన్ బాణీల్లో వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సాంగ్స్ సృష్టించిన రికార్డులే దీనికి సరైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్‌లో కూడా అదే రేంజ్ మ్యూజిక్ అందించాలని తమన్ కసరత్తులు చేస్తున్నారట. ఇందులో భాగంగా అదిరిపోయే ఓ ఫోక్ సాంగ్ ప్లాన్ చేశారట. ఫోక్ సాంగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న పెంచల్‌దాస్ ఈ పాటను ఆలపించనున్నారని సమాచారం. సెకండాఫ్‌లో ఈ సాంగ్ వస్తుందని అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెర్సటైల్ హీరో రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. చిత్రంలో సముద్రఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్‌గా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదాపడ్డ ఈ మూవీ షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xOW21q
No comments:
Post a Comment