రీసెంట్‌గా రామ్ గోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూతో మరోసారి రచ్చ రచ్చ చేసింది బిగ్ బాస్ బ్యూటీ అరియనా. జిమ్ములో పొట్టి బట్టలతో ఆర్జీవీని ఇంటర్వ్యూ చేస్తూ ఆయన చేత పచ్చి నిజాలను బయట పెట్టించింది. ‘అరియానా బోల్డ్ టాక్ విత్ ఆర్జీవీ’ అంటూ ఇద్దరూ కలిసి బోల్డ్ మాటలతో పిచ్చెక్కించారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియోకి భారీ స్పందన వచ్చినప్పటికీ.. ఈ వీడియో చూసిన కొంతమంది మాత్రం తీవ్రంగా విమర్శించారు. కూతురు వయసున్న అరియానాతో ఇలాంటి ఇంటర్వూస్ ఏంటి? అని కొందరు కామెంట్ చేయడం చూశాం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ బోల్డ్ ఇంటర్వ్యూ విషయమై అరియానా రియాక్ట్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీన్ని చూసి బోల్డ్ అని ఎందుకంటున్నారో.. ఇందులో బోల్డ్ ఏముందో తనకైతే అర్థం కావడం లేదని చెప్పింది.
అరియానాను ఫేమస్ చేసిన ఆర్జీవీ..
నిజానికి అరియానాను ఫేమస్ చేసిన ఆర్జీవీనే. గతంలో ఓ ఇంటర్వ్యూలో నేరుగా ఆమె ఫిగర్‌పై కామెంట్ చేసి అందరి దృష్టి అరియానాపై పడేలా చేశారు రామ్ గోపాల్ వర్మ. ‘నీ ఫిగర్ అంటే ఇష్టం.. నీ తొడలు అంటే ఇష్టం.. నిన్ను బికినీలో చూడాలని ఉంది’ అని వర్మ అనడంతో ఒక్కసారిగా యాంకర్ అరియానా పాపులర్ అయిపోయింది. అలా ఏకంగా బిగ్ బాస్ అవకాశం దక్కించుకొని బోల్డ్ బ్యూటీగా బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ చేసి.. మళ్ళీ ఇప్పుడు వర్మ ఇంటర్వ్యూలో హాట్ టాపిక్ అయింది.
మొదటి నుంచే పక్కా ప్లాన్.. రెచ్చిపోయిన అరియానా!
రామ్ గోపాల్ వర్మతో కలిసి జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ దిగిన ఫొటోస్ వదులుతూ మొదటి నుంచే పక్కా ప్లాన్‌గా ఈ ఇంటర్వ్యూపై హైప్ తీసుకొచ్చారు వర్మ. అంతేకాదు ఈ ఇంటర్వ్యూకి టీజర్ రిలీజ్ చేసి తన విలక్షణతను చాటుకున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా ఈ ఇంటర్వ్యూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తుండగా చివరకు ఆ వీడియో వదిలి జనాల్లో చర్చలకు తెరలేపారు. ఇందులో వర్మే అనుకుంటే వర్మని మించి అన్నట్టుగా అరియానా రెచ్చిపోవడం చూసి అంతా షాకయ్యారు.
ఆర్జీవీకి ఆ అలవాటు ఉంటే..! నాకే అది ప్లస్
ఈ ఇంటర్వ్యూ విషయమై జోరుగా చర్చలు నడుస్తున్న నేపథ్యంలో అరియానా స్పందించింది. 'ఆర్జీవీతో అంతసేపు ఇంటర్వ్యూ చేయడమే ఓ పెద్ద టాస్క్. నాకు ఇది ప్లస్ అవుతుందేమో కానీ ఆయనకు మామూలే' అని ఒక్కమాటలో చెప్పేసింది. అందరూ ‘బోల్డ్ ఇంటర్వ్యూ’ అంటున్నారు కానీ అందులో అంత బోల్డ్ ఏముందో అర్థం కావడం లేదని ఆమె చెప్పింది. ఒకవేళ ఆర్జీవీకి అమ్మాయిలను వేధించే అలవాటే గనక ఉంటే.. ‘మీటూ’లో ఆయన పేరు ఉండేదిగా! ఎవరన్నా ఆయనపై ఫిర్యాదు చేశారా? అంటూ లాజిక్ మాట్లాడింది అరియానా.
కాంప్రమైజ్ కావాల్సిందే.. తప్పదు!
చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలన్నా, పదికాలాల పాటు కెరీర్‌ను కొనసాగించాలన్నా కాంప్రమైజ్ కాక తప్పదనని అరియానా చెప్పడం విశేషం. ఈ ఫీల్డ్‌లో విజయం సాధించాలంటే కోపగించుకోకూడదని, కోపం వల్ల సాధించేదేమీ లేదు కాబట్టి కాంప్రమైజ్ కావాల్సిందే అని ఆమె తెలిపింది. అలాగే తనను ట్రోల్ చేస్తున్న వారు తాము ఫేమస్ అయ్యేందుకు మాత్రమే అలా చేస్తున్నారంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది అరియానా.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3d6gC5K
No comments:
Post a Comment