సమాజంలోని అసమానతలు, వివక్షల మీద ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. సామాజిక స్పృహను కలిగించే కథనాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అయితే వాటిని అన్ని వర్గాల ప్రేక్షకులకు దరిచేరేలా తెరకెక్కించగలగాలి. అలాంటి కథలకు ప్రేమను జోడించి చెప్పడం మన దర్శకులకు అలవాటే. అయితే తాజాగా అర్ద శతాబ్దం అంటూ ఓ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆహాలో నేటి నుంచి ఈ మూవీ అందుబాటులో ఉంటుంది. ఈ సినిమా కథ ఎలా ఉందో ఓ సారి చూద్దాం. అది సిరిసిల్ల గ్రామం 2003వ సంవత్సరం. గ్రామంలో కులాల కట్టుబాట్లతోనే జీవిస్తారు. ఎవరి పని వారే చేయాలనే భావంతోనే ఉంటారు. ఆ గ్రామంలో కృష్ణ ().. పుష్ప( కృష్ణ ప్రియ)ను ప్రేమిస్తాడు. చిన్నతనం నుంచి ఆమె అంటే ఇష్టం ఉన్నా కూడా బయటకు చెప్పలేకపోతాడు. పుష్ప మాత్రం కనీసం అతని వంక కూడా చూడదు. ఓ సారి పుష్ప తనను ప్రేమిస్తుందనే భ్రమలో ఓ చిన్న తప్పు చేసేస్తాడు. ఆ తప్పుతో ఊరి మొత్తం రావణ కాష్టంగా మారుతుంది. కులాల పేరుతో ఒకరినొకరు చంపుకుంటారు. అయితే కృష్ణ చేసిన తప్పుఏంటి? చివరకు గ్రామంలో ఏం జరిగింది? ఈ కథలో ఎస్సై రంజిత్ పాత్ర ఏంటి? అనే ఆసక్తికర అంశాలకు సమాధానమే . ఊరిలో అల్లరి చిల్లరగా తిరిగే కృష్ణ పాత్రలో కార్తీక్ రత్నం మెప్పించారు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్‌లోనూ కార్తీక్ రత్నం పర్వాలేదనిపించారు. లుక్స్ పరంగా పాత్రకు తగ్గట్టుగా కనిపించారు. ఇక కృష్ణ ప్రియ కూడా పుష్ప పాత్రలో బాగానే కనిపించారు. అందంగా కనిపించడంతో పాటు నటనతోనూ మెప్పించారు. రామన్నగా మాజీ నక్సలైట్ పాత్రలో సాయి కుమార్ బాగానే మెప్పించారు. వీరన్న పాత్రలో ఊర్లో పెద్ద మనిషిగా రాజా రవీంద్ర కనిపించారు. ఉన్నది కొన్ని సీన్లే అయినా పర్వాలేదనిపించారు. పోలీస్ ఉద్యోగం అంటే ఇష్టమైనా కూడా చంపడం, ఎన్ కౌంటర్లు ఇష్టం లేని ఎస్సైగా రంజిత్ పాత్రలో మెప్పించారు. మంత్రి రంగా రావుగా శుభాలేఖ సుధాకర్ డైలాగ్స్‌కే పరిమితమయ్యారు. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించారు. ఇలాంటి సున్నితమైన కథను ఎంచుకున్నప్పుడు ప్రేక్షకుడి దృష్టిలోంచి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యానికి కథనం సరిగ్గా ఉంటేనే ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. ఇందులో ఎన్నో లాజిక్‌లు మిస్ అయినట్టు కనిపిస్తుంటారు. బలమైన పాయింట్‌ను ఎంచుకున్న దర్శకుడు అంతే బలంగా రక్తికట్టించలేకపోయారు. గ్రామంలో జనాలు అందరూ నరుక్కుని చంపుకుంటూ ఉంటే.. కొంతమందికి ఆ విషయమే తెలీదు. ఇక గ్రామంలోకి ఎంటరైన ఎస్సై అక్కడే నిల్చుని చోద్యం చూస్తుండటం ఏంటో ఎవ్వరికీ అంతు పట్టదు. ప్రేమ అంటూ వెంటపడుతున్న సమయంలో గ్రామంలో ఎవ్వరికీ గుర్తు రాని హీరో కులం.. సినిమా ద్వితీయార్థంలో గుర్తుకు వస్తుంది. ఒక్కటి రెండూ సీన్లలో టీఎన్ఆర్ పాత్రను అలా ఎందుకు ముగించేశారో ఎవ్వరికీ అర్థం కాదు. ఇలా ఎన్నో సన్నివేశాలు ప్రేక్షకులకు స్పీడ్ బ్రేకర్లా అడ్డు పడుతుంటాయి. అలా అర్ద శతాబ్దం సినిమాలో కథా మూలం మంచి పాయింటే అయినా కూడా ప్రేక్షకుడిని మెప్పించేలా తెరకెక్కించడంలో మాత్రం దర్శకుడు రవీంద్ర పుల్లె తడబడినట్టు కనిపిస్తారు. ఇక ఈ చిత్రంలో కాస్త ప్లస్ అయ్యేవి ఏవైనా ఉన్నాయంటే అవి మాటలే. డైలాగ్స్ ఆలోచనలు రేకెత్తించేలా ఉండటం కలిసొచ్చే అంశం.ఇక సంగీతం పరంగా నోఫెల్ రాజ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే అనిపించింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాలు తమ పరిధి మేరకు పని చేశాయి. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. చివరగా.. అర్థం లేనట్టుగా అసంపూర్ణంగా మిగిలిన అర్దశతాబ్దం
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3grS7k1
No comments:
Post a Comment