Birthday: 'చిరుత'లా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూకి అగ్ర హీరోల్లో ఒకరుగా, మెగా వారసుడిగా సత్తా చాటుతున్నారు రామ్ చరణ్. మొదట స్టార్ కిడ్‌గా బరిలోకి దిగినా కూడా ఆ తర్వాత నటనాపరంగా భేష్ అనిపించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి మెగా పవర్ స్టార్ అనిపించున్నారు. తన ప్రయాణంలో కొన్ని పరాజయాలు ఎదురైనా ఏ మాత్రం వెనుకడుగేయకుండా మరింత కసిగా తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకొని తండ్రికి తగ్గ తనయుడిగా మెప్పు పొందుతున్నారు. అందుకే మెగా లోకం చెర్రీ సినిమాలకు నీరాజనం పడుతోంది. నిన్నటితరంలో అంటే క్రేజ్ ఎంతలా ఉండేదో.. నేటితరంలో రామ్ చరణ్ అంటే అంతే క్రేజ్ ఉందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. చిరంజీవి సినిమా అంటే ఫైట్స్, డాన్స్‌లే గుర్తొచ్చేవి. కథకు ఈ రెండూ మేజర్ అసెట్ అయ్యేవి. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే పంథా కొనసాగిస్తూ ప్రేక్షకుల చేత బెస్ట్ డాన్సర్ అనిపించుకుంటున్నారు. ఎలాంటి పాత్ర అయినా చేయగలనని ఇప్పటికే పలు డిఫరెంట్ రోల్స్ చేసి నిరూపించుకున్న ఆయన మెగా ఫ్యామిలీకి మేజర్ అసెట్ అయ్యారని చెప్పుకోవచ్చు. మెగా వారసుడిగా, మెగా ఫ్యామిలీ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న రామ్ చరణ్‌ని చూసి తండ్రిగా చిరంజీవి ఉప్పొంగిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే నేడు (మర్చి 27) కొడుకు 36వ పుట్టినరోజు సందర్భంగా బెస్ట్ విషెస్ అందించారు చిరంజీవి. ఈ మేరకు మెగా అభిమానులు ఫిదా అయ్యేలా ఓ ఎమోషనల్ వీడియో పోస్ట్ చేస్తూ 'హ్యాపీ బర్త్ డే మై బాయ్' అన్నారు. అప్పుడు.. ఇప్పుడు.. ఎల్లప్పుడూ తనకు రక్షణ ఇచ్చేది రామ్ చరణ్ అని తెలిపేలా చిన్నప్పుడు రామ్ చరణ్ గొడుగు పట్టుకున్న ఫొటోతో పాటు ఇటీవల అలాంటివే మరో రెండు ఫొటోలను కూడా జత చేసి ఓ అద్భుతమైన వీడియోను మెగా అభిమానుల ముందుంచారు చిరంజీవి. ఈ వీడియోలో డాడీ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యమ అట్రాక్ట్ చేస్తోంది. చిరంజీవి పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి మెగా అభిమానులు తెగ మురిసిపోతూ చెర్రీకి బర్త్ డే విషెస్ వెల్లువలా పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఫైనల్‌గా.. తనదైన స్టైల్‌లో మెగా లోకాన్ని ఉర్రూతలూగిస్తున్న రామ్ చరణ్‌కి మీ మా 'సమయం' తరఫున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2P3l7VX
No comments:
Post a Comment