బ్యాచిలర్ లైఫ్ నుంచి భర్తగా ప్రమోషన్ అందుకున్నాక వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు యంగ్ హీరో . జంటగా ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'రంగ్ దే'. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా సితార ఎంటర్టైన్మైంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిత్ర ప్రమోషన్స్ ఫుల్లుగా చేసి సినిమాపై హైప్ పెంచేసుకుంది చిత్రయూనిట్. ముఖ్యంగా హీరోహీరోయిన్ నితిన్- కీర్తిసురేష్ లను కొత్తగా, చాలా డిఫరెంట్ వే లో చూపించబోతున్నట్లు ప్రమోషన్స్ చేపట్టారు. అర్జున్, అనుగా నటిస్తున్న ఆ ఇద్దరి లవ్ స్టోరీ ఎలా నడించిందనే కథ, అందులో ట్విస్టులు లాంటి సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ రోజే (మార్చి 26) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికే ఈ సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ రెస్పాన్స్ తెలుపుతున్నారు. మరి ఆ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దామా.. అను, అర్జున్ చిన్నప్పటి సన్నివేశాలతో ప్రారంభమైన ఈ సినిమా ఫస్టాఫ్ అంతా కామెడీ ప్రధానాంశంగా సాగిందని అంటున్నారు. హీరో హీరోయిన్ మధ్య ఇగో, క్లాషెస్ లాంటి సన్నివేశాలతో మొదలై అను, అర్జున్‌పై ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుందట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ వార్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుందని టాక్. నితిన్- కీర్తి సురేష్ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయిందని, పాటలు, విజువల్స్ ఫర్వాలేదనిపించాయని.. ఫస్టాఫ్ ఓకే కానీ సెకండాఫ్ యావరేజ్‌గా ఉందని ట్వీట్స్ వస్తున్నాయి. మొత్తానికైతే ఇది కంప్లీట్ డిఫరెంట్ మూవీ అయితే కాదని, రొటీన్ స్టోరీనే అంటున్నారు. హీరోహీరోయిన్లతో పాటు కమెడియన్స్ పర్‌ఫార్‌మెన్స్ సినిమాకు ఓ అసెట్ అయిందని చెబుతున్నారు. మరోవైపు నితిన్ 'రంగ్ దే' మూవీ సక్సెస్ కావాలని కోరుకుంటూ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, యంగ్ హీరో సందీప్ కిషన్, సుశాంత్ తదితరులు ట్వీట్స్ చేస్తున్నారు. మరి కాసేపట్లో 'సమయం' నుంచి ఈ సినిమా పూర్తి రివ్యూ రానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lRHLwc
No comments:
Post a Comment