ఇటీవలి కాలంలో యువ హీరోహీరోయిన్లంతా వరుసపెట్టి పెళ్లి పీటలెక్కేస్తున్నారు. ఆ లిస్టులో బ్యూటిఫుల్ యంగ్ హీరోయిన్ కూడా చేరిపోయింది. గుట్టుచప్పుడు కాకుండా నిన్న ఆమె నిశ్చితార్ధ వేడుక కూడా జరిగిపోయింది. గత కొన్ని రోజుల క్రితమే.. తాను హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌తో ప్రేమలో ఉన్నానని, కుటుంబ సభ్యుల అంగీకారంతో త్వరలో తమ వివాహం చేసుకోబోతున్నానని తెలిపింది మెహ్రీన్. ఇంతలోనే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అతనితో నిశ్చితార్థం చేసుకొని సడెన్ షాకిచ్చింది ఈ ముద్దుగుమ్మ. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో మెహ్రీన్- భవ్య బిష్ణోయ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ షురూ చేశారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య గురువారం సాయంత్రమే నిశ్చితార్ధ వేడుక ప్రారంభం కాగా, శుక్రవారం ఉదయం మెహ్రీన్, బిష్ణోయ్‌లు పూజలు నిర్వహించారు. అనంతరం నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నారు. మెహ్రీన్ సోదరుడు గుర్ఫతే సింగ్ పిర్జదా ఈ నిశ్చితార్థ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ పిక్స్ వెంటనే వైరల్ అయ్యాయి. మొదట ఈ విషయం తెలిసి షాకైన నెటిజన్లు ఆ తర్వాత ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఏడాదే వారి వివాహం జరుగుతుందని, అయితే ఎప్పుడనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని నిశ్చితార్ధ అనంతరం మెహ్రీన్ తల్లి పమ్మి పిర్జాదా తెలిపారు. 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ కొన్ని సినిమాలతోనే ఫేమస్ అయింది. ''F2, కవచం, మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్'' లాంటి సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం అనిల్ రావిపూడి రూపొందిస్తున్న F2 సీక్వల్ F3లో నటిస్తోంది. సో.. చూడాలి మరి మెహ్రీన్, తన పెళ్లి తేదీ అయినా ముందుగా ప్రకటిస్తుందా? లేక నిశ్చితార్థం లాగే సీక్రెట్‌గా ఫినిష్ చేస్తుందా అనేది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vn8KE6
No comments:
Post a Comment