చిన్న సినిమానే.. అది కూడా లో- బడ్జెట్ మూవీ.. పైగా ఎలాంటి భారీ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా బరిలోకి దిగిన గల్లీ పోరగాళ్లు కలెక్షన్స్ వసూలు చేయడంలో నిజమైన '' అనిపించుకుంటున్నారు. కోట్లలో రాబడి తెస్తూ తమను నమ్మిన నిర్మాతల జేబులు నింపుతున్నారు. అదేనండీ.. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జాతిరత్నాలు' మూవీ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. పోటీలో ఉన్న ఇతర సినిమాలకు చుక్కలు చూపిస్తూ దూసుకుపోతోంది. విడుదలకు ముందు చేసిన ప్రమోషన్స్ మొదటి రోజే మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టగా, ఆ తర్వాత వచ్చిన మౌత్ టాక్‌తో వరుసగా అదే జోష్ కంటిన్యూ అవుతోంది. ఐదో రోజు కూడా ఈ జాతిరత్నాల స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి 20 కోట్ల మేర షేర్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇక వీకెండ్ ముగిశాక కూడా అదే హవా కనిపిస్తుండటం చిత్ర యూనిట్‌లో ఆనందం నింపుతోంది. చిన్ననాటి స్నేహితులుగా నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటన తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా థియేటర్స్ సంఖ్య పెంచేశారు. ఓటీటీ ఆఫర్స్ లెక్క చేయకుండా ధైర్యంగా థియేటర్స్‌లో దిగిన జాతిరత్నాల వ్యూహం ఫలించి మొత్తం 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 23.46 కోట్ల రూపాయలు కలెక్ట్ అయ్యాయి. గ్రాస్ కలెక్షన్స్ అయితే 39 కోట్ల వరకు వెళ్లాయని ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో తమదే పైచేయి అన్నట్లుగా ఈ గల్లీ పోరగాళ్ళు సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తున్నారు. చూస్తుంటే మరో రెండు మూడు రోజుల్లో ఈ మూవీ 50 కోట్ల క్లబ్‌లో చేరిపోతుందని క్లియర్‌గా అర్థమవుతోంది. స్వప్న సినిమా బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మించిన 'జాతిరత్నాలు' ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడం సినీ వర్గాల్లో సైతం ఆనందం నింపుతోంది. మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే థియేటర్స్ జనంతో కళకళలాడి పూర్వ వైభవం సంతరించుకుంటాయని ఈ జాతిరత్నాలు నిరూపించారు. చిత్రాన్ని తనదైన స్టైల్‌లో మలిచిన అనుదీప్ కేవీ దర్శకత్వ ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3llO8Yp
No comments:
Post a Comment