టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ''. మెగాస్టార్ హీరోగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. చిరంజీవి తనయుడు, స్టార్ హీరో రామ్ చరణ్ సిద్ద పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే మరో హీరోయిన్‌గా నీలాంబరి పాత్ర పోషిస్తోంది. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేస్తున్న కొరటాల ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమా హైలైట్ పాయింట్స్‌పై రియాక్ట్ అవుతూ ఓపెన్ అయ్యారు డైరెక్టర్ కొరటాల శివ. ఆచార్య నుంచి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయని ఆయన అన్నారు. అందులో చిరంజీవి సాంగ్ ఒకటి కాగా, మరొకటి రామ్ చరణ్ సాంగ్ అని, సినిమా విడుదలకు ముందే ఈ రెండు సూపర్ హిట్ అయ్యాయని చెప్పిన కొరటాల.. చిరు- రామ్ చరణ్ కాంబోలో మరో పాట షూట్ చేశామని అన్నారు. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారని, ఈ సినిమా హైలైట్స్‌లో ఈ సాంగ్ ఒకటిగా నిలుస్తుందని చెబుతూ సీక్రెట్ రివీల్ చేశారు. కాగా చిరు- రామ్ చరణ్ కాంబోలో ఈ సాంగ్ షూట్ చేస్తున్న సమయంలో ఓ రోజు చిరంజీవి ఫ్యామిలీ మొత్తం సెట్‌కి వచ్చిందని, ఆ తర్వాత రోజున రామ్ చరణ్ సన్నిహితులంతా, ఇక ఆ మరుసటి రోజున ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలంతా కూడా వచ్చారని కొరటాల తెలిపారు. అలా ఓ ఐదు రోజుల పాటు సెట్లో జాతర వాతావరణం కనిపించిందని ఆయన చెప్పడం విశేషం. భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Dh16hk
No comments:
Post a Comment