నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. బాలయ్య బాబు హీరోగా రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'అఖండ' నేడు (డిసెంబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బాలకృష్ణ- బోయపాటి కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. దీనికి తోడు సినిమా షూటింగ్ జరుగుతుండగానే బోయపాటి రిలీజ్ చేసిన మూవీ అప్‌డేట్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. దీంతో ఈ మూవీ చూడాలని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. అయితే నేడు విడుదల కానున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే అనగా గత రాత్రి ఈ సినిమా ఓవర్‌సీస్‌లో ప్రదర్శించబడింది. పలుచోట్ల ప్రివ్యూ వేశారు. దీంతో ఇప్పటికే 'అఖండ' చూసేసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు బాలయ్య బాబుకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఆడియన్స్ టాక్, ట్విట్టర్ పోస్టుల ఆధారంగా చూస్తే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయిందని తెలుస్తోంది. ఫస్టాఫ్ అదిరిపోయిందని, మాస్ ఆడియన్స్ మెచ్చేలా కిక్కిస్తూ బోయపాటి మార్క్ స్పష్టంగా చూపించారని అంటున్నారు. సెకండాఫ్ కూడా అంతకుమించిన మాస్ ఎలిమెంట్స్‌తో అద్భుతంగా వచ్చిందని చెబుతున్నారు. ఎప్పటిలాగే బాలకృష్ణ హోల్ అండ్ సోల్ పర్‌ఫార్‌మెన్స్ చూపించగా హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారని అంటున్నారు. తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ అని, ఇది కంప్లీట్ మాస్ ప్యాకేజ్ అని ట్వీట్స్ పెడుతున్నారు. బాలకృష్ణ అఘోరా పాత్ర అయితే సినిమాలో హైలెట్ పాయింట్ అంటున్నారు. అదిరిపోయే సీన్స్, నందమూరి బలకృష్ణ డైలాగ్స్ చూస్తూ ఆయన ఫ్యాన్స్ థియేటర్స్‌లో గోల పెట్టేశారట. మొత్తం మీద ఈ 'అఖండ' సినిమా బాలకృష్ణ ఫ్యాన్స్‌కి బిగ్ ట్రీట్ ఇచ్చినట్లే అనే టాక్ అయితే బయటకొచ్చింది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో పూర్ణ నటించింది. బాలయ్య బాబు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. ప్రతినాయకుడిగా శ్రీకాంత్ నటించగా.. జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rrlPNi
No comments:
Post a Comment