ప్రస్తుతం పనుల్లో బిజీగా ఉంది. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కలిసి చేస్తోన్న లైగర్ ప్రాజెక్ట్ మీద నేషనల్ వైడ్‌గా క్రేజ్ ఏర్పడింది. ఇక బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ రాకతో అంతర్జాతీయంగా ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. మైక్ టైసన్, విజయ్ కాంబినేషన్‌లో సీన్లు తెరకెక్కించేందుకు లైగర్ టీం గత నెలలోనే వెగాస్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ మైక్ టైసన్ మీద తెరకెక్కించాల్సిన సన్నివేశాలు అయిపోయాయి. లైగర్ అమెరికా షెడ్యుల్ ముగిసింది. కానీ లైగర్ టీం మాత్రం ఇంకా ఇండియాకు చేరుకోలేదు. అయితే ఛార్మీ మాత్రం అక్కడి వీధుల్లో చక్కర్లు కొట్టేస్తుంది. సైకిల్ తొక్కుతూ అటూ ఇటూ తిరుగుతోంది. ఇక ఇష్టమైన ఫుడ్ అంటూ ఫుల్లుగా లాగించేస్తోంది. తాజాగా ఆమె తనకు ఎంతో ఇష్టమైన స్పానిష్ ఫుడ్ ఇన్ అమెరికా అంటూ పోస్ట్ చేసింది. ఛార్మీ అలా తనకు ఇష్టమైన ఆహారాన్ని లాగించేస్తుంటే జనాలు మాత్రం రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. చూస్తుంటే అది పీతల బిర్యానీలా కనిపిస్తోంది. ఇక దానిపై నెటిజన్లు ఛార్మీని ఆడుకుంటున్నారు. వాటి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.. పెద్దపులి ఎదురుచూస్తోందని ఒకడు.. వాటిని కేవలం కుక్కలే తింటాయి నాకు అవి నచ్చవు అని మరొకడు.. ఎంతో రుచికరంగా ఉంటుందని ఇంకొకడు.. ఫుడ్ టేస్టీగా ఉన్నట్టుంది.. నాకు పార్సిల్ పంపించండని మరొకడు ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నాడు. మొత్తానికి ఛార్మీ మాత్రం ఇలా నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ పూరి, ఛార్మీ ఇద్దరూ నిలదొక్కుకున్నారు. లైగర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియన్ సినిమాతో మరోసారి హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/304MDI2
No comments:
Post a Comment