రాజ్ గతంలో పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ మీద చేసిన కామెంట్లు అందరికీ తెలిసిందే. రాజకీయ పరంగా పృథ్వీ వైఎస్సార్ సీపీ కావడంతో జనసేన, మీద నానా రకాలుగా విమర్శలు చేశాడు. పవన్ కళ్యాణ్ మీద ఇష్టమొచ్చినట్టుగా నోరు పారేసుకున్నాడు. అయితే ఆడియో టేపు మ్యాటర్‌తో పృథ్వీ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది. ఇక మళ్లీ సినిమాల్లో ప్రయత్నాలు కొనసాగించాడు. అయితే మెగా ఫ్యామిలీ మీద రాజకీయంగా కామెంట్లు చేసినా కూడా సినిమా అవకాశాలు మాత్రం ఇచ్చారని, పైగా రికమండ్ చేశాడని పృథ్వీ అన్నాడు. వాడికి ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వమని అన్నాడట. ఆ విషయాలన్నీ పృథ్వీ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా. కానీ తాజాగా పృథ్వీ షేర్ చేసిన ఓ ఫోటో మాత్రం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అన్నయ్యతో తమ్ముడు.. అంటూ ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ఎంతో భక్తిభావనలు, వినయ విధేయతలో చిరు పక్కన చేతులు కట్టుకుని నిల్చున్నాడు పృథ్వీ. ఇక ఈ ఫోటో మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. ట్రోల్స్‌తో ఆడుకుంటున్నారు. ‘అవకాశాలు రాకపోయేసరికి అన్నయ్య గుర్తు ఒచ్చినట్టు ఉన్నాడు’, ‘అది రా ఆ ఫ్యామిలీ గొప్పతనం’, ‘మళ్ళీ మా అన్న దగ్గరికి చేరుకున్నావ్’, ‘నువ్వు చేసిన మోసం అంతా ఇంతా కాదు చెప్పలేనంత అయినా కూడా హక్కున చేర్చుకున్న ఆ కుటుంబానికి నువు ఎంత మాత్రం కృతజ్ఞత చూపించడం లేదు. నమ్మక ద్రోహానికి మరో పేరే పృథ్వీ రాజ్’, ‘ఉసరవెల్లి కుడా సిగ్గు తో తల దించుకుంటుంది నిన్ను చుస్తే నువ్వు చెసినా పనులకు అందితే జుట్టు అందకపొతే కాళ్లు తు ని బతుకు’ అంటూ ఇలా ఒక్కో నెటిజన్ ఒక్కో రకంగా కామెంట్ చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lGiLt6
No comments:
Post a Comment