ఓ షో హోస్ట్ చేయాలంటే సుమ తర్వాతే ఎవరైనా. ఎదురుగా ఉన్నవాళ్ళ మనసు నొప్పించకుండానే మాట మాటకూ పంచ్ విసరడం ఆమెలోని ఓ క్వాలిటీ అయితే.. విషయం పక్కదారి పడుతుంటే సందర్భానుసార మాటలతో తిరిగి ట్రాక్ లోకి తీసుకురావడం మరో క్వాలిటీ. అందుకే ఎన్నో ఏళ్లుగా బుల్లితెర మహారాణిగా అదే క్రేజ్‌తో దూసుకుపోతోంది సుమ. మరోవైపు ఆమె భర్త వెండితెరపై విలక్షణ పాత్రలు పోషిస్తూ రాణిస్తున్నారు. వీళ్లిద్దరి దాంపత్య జీవితంపై పలు రకాల రూమర్స్ నడిచినా అవేవీ నిజం కాదని తెలిస్తోంది. వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితమే, వృత్తి పరమైన జీవితం వృత్తి పరమైన జీవితమే.. దేనికవే సపరేట్ అన్నట్లుగా అటు గృహిణిగా, ఇటు వ్యాఖ్యాతగా సక్సెస్ అయింది సుమ. అయితే ఆమె ఎన్ని షోస్ హోస్ట్ చేసినా తన వైవాహిక జీవితాన్ని పెద్దగా టచ్ చేయదనే సంగతి మనందరికీ తెలుసు. కాకపోతే తాజాగా క్యాష్ షోలో ఆమె భర్త రాజీవ్ గురించిన ప్రస్తావన రావడం, దానికి ఇక చాలు ఆపండి అని సుమ అనడం హైలైట్ అయింది. డిసెంబర్ 18వ తేదీన ప్రసారం కాబోతున్న క్యాష్ ప్రోగ్రాం ప్రోమో రిలీజ్ చేయగా అందులో ఈ సీన్ కనిపించింది. ఈ షో తాజా ఎపిసోడ్ కోసం బుల్లితెర నటులు బుల్లెట్ భాస్కర్, రాం ప్రసాద్, విష్ణుప్రియ, మేఘనలు తమ తమ పేరెంట్స్‌ను తీసుకొచ్చారు. భాస్కర్, రాం ప్రసాద్ వాళ్ల నాన్నలతో రాగా.. మేఘన, విష్ణుప్రియ తమ అమ్మలతో వచ్చారు. ఇక ఈ షోలో 'తండ్రి గొప్పనా? తల్లి గొప్పనా?' అనే టాపిక్‌పై డిస్కషన్ నడిచింది. ఇందులో అందరూ వాదించుకుంటూ చివరకు విషయాన్ని సుమ వద్దకు తీసుకొచ్చారు. దీంతో వెంటనే అలర్ట్ అయి తన చాకచక్యంతో కంట్రోల్ చేసేసింది సుమ. ఆడవాళ్లే గొప్ప 80 శాతం ఆడవాళ్ళ పాత్రే ఉంటుందని మేఘన అమ్మ చెబుతూ సుమను చాలామంది స్ఫూర్తిగా తీసుకున్నారని చెప్పింది. దీంతో ఆ వెంటనే బుల్లెట్ భాస్కర్ తండ్రి ఎంటరై ఏకంగా రాజీవ్ కనకాలను లాగుతూ టాపిక్ సుమ ఫ్యామిలీ మీదకు మలిచేశాడు. దీంతో సుమ 'ఇక చాలు ఈ టాపిక్ ఇక్కడితో ఆపేయండి' అనేసింది. దీంతో ఇటు సుమ, అటు రాజీవ్ కనకాల ఇద్దరూ కష్టపడుతున్నారని చెప్పాడు బుల్లెట్ భాస్కర్ తండ్రి. వెంటనే కంగ్రాట్స్ అంటూ డిబేట్ క్లోజ్ చేసింది సుమ. ఇలా తన చాకచక్యమే విషయాన్ని డైవర్ట్ కాకుండా చూసిందనేది ఈ ప్రోమో వీడియో చూసిన నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31K7wJv
No comments:
Post a Comment