అల్లు అర్జున్- జంటగా నటించిన భారీ సినిమా '' విడుదలకు సిద్ధమైంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను డిసెంబర్ 17న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా గత రాత్రి (ఆదివారం) హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేదికపై రష్మిక మాట్లాడిన తీరు, ఆమె కట్టు బొట్టు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. తనదైన మాటలతో బన్నీ అభిమానుల్లో నూతనోత్సాహం నింపేసింది రష్మిక. వేదిక మీదకు రాగానే ముందుగా బన్నీ అభిమానులకు, తన ఫ్యాన్స్ అందరికీ ముద్దులిస్తూ నమస్కారం చెప్పింది రష్మిక. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత ఇలాంటి అతిపెద్ద వేడుకలో పాల్గొనడం, ఇలా మీ అందరినీ చూడటం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అని చెప్పింది. మీరందరూ బన్నీ గారి స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారు అని అర్థమైందని అంటూనే తాను తొందరగా మాట్లాడి వెళ్ళిపోతానని చెబుతూ తన మనసులోని మాటలను బయటపెట్టేసింది రష్మిక. ''ఈ వేడుకకు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న గెస్టులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గీత గోవిందం ఆడియో రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్‌ని చూసి ఆయనతో నటించాలని కోరుకున్నా. ఈ రోజు నీ శ్రీవల్లిగా పుష్ప సినిమాలో నటించా. అల్లు అర్జున్‌తో వర్క్ చేయడం అంటే చాలా ఇష్టపడతాను. ఇదే సమయం.. నా మనసులో మాట చెప్పడానికి బన్నీ సార్ ఐ లవ్ యూ.. థాంక్యూ సో మచ్'' అనేసింది రష్మిక. దీంతో వేదిక ప్రాంగణం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. రష్మిక మాటలకు బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక సుకుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన రష్మిక.. ఆయన గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దాదాపు రెండేళ్ల పాటు తన పేరెంట్స్‌ని చూడలేదని, అంతలా ఈ సినిమాలో లీనమై పోయానని పేర్కొంది. కాగా తనను దత్తత తీసుకోవాలని, అందుకు సంతకం కూడా పెట్టాలి అని సుకుమార్ గారిని అడిగినట్లు రష్మిక చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ ఈలలతో గోల పెట్టేశారు. సుకుమార్ టాలెంట్ గురించి మాటల్లో చెప్పలేమంటూ తెగ పొగిడేసింది రష్మిక. ఇక ఈ మూవీ నిర్మాతలకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ చిత్రయూనిట్ అంతా ఎంతో కష్టపడి పని చేస్తూ అన్ని విషయాల్లో సహకరించారని చెప్పుకొచ్చింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yiLyJ6
No comments:
Post a Comment