పవర్ స్టార్ అభిమానులను హుషారెత్తించే మరో వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన లేటెస్ట్ మూవీ '' కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఈ సినిమాలో కామెడీ కింగ్ కూడా భాగమవుతున్నారని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హాస్య బ్రహ్మగా కొన్ని వందల సినిమాల్లో తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మానందం.. గత కొన్నేళ్లుగా పెద్దగా సినిమాలు చేయడం లేదు. రీసెంట్‌గా 'జాతి రత్నాలు' సినిమాలో తిరిగి తన మార్క్ చూపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం భీమ్లా నాయక్‌పై ప్రేక్షకుల ఆతృతకు రెక్కలు కట్టింది. ఇటీవల ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రామ్‌కు గెస్ట్‌గా వచ్చిన బ్రహ్మానందం తాను భీమ్లా నాయక్ సినిమాలో భాగమవుతున్న విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే ఎంతో సీరియస్ సబ్జెక్టుతో రూపొందుతున్న ఈ సినిమాలో బ్రహ్మి క్యారెక్టర్ జొప్పించి కామెడీ సృష్టించడమనేది మరింత ఆసక్తికరంగా మారింది. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఒరిజినల్ వర్షన్‌లో ఎలాంటి కామెడీ క్యారెక్టర్స్ లేకపోయినా తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచేలా బ్రహ్మానందం రోల్ క్రియేట్ చేశారని టాక్. పోలీస్ పాత్రలో కాస్త సీరియస్ గానే కనిపించినా బ్రహ్మి క్యారెక్టర్ సినిమాకి కీలకం కానుందని అంటున్నారు. సాగర్.కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేలో రూపొందిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. మురళీ శర్మ, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా.. థమన్ బాణీలు కడుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3IrXhtD
No comments:
Post a Comment