సౌత్ ఇండియన్ తెరపై గత 20 ఏళ్లుగా తన మార్క్ చూపెడుతూ వస్తోంది స్టార్ హీరోయిన్ . పలు భాషల్లో అగ్ర హీరోలతో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకున్నాక సినిమాలకు కాస్త దూరమయ్యారు. భర్త ఆండ్రూ కొశ్చీవ్‌తో సరదా టూర్స్ వేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే చాలా గ్యాప్ తర్వాత తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె.. డిసెంబర్ 10న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ ఆ సినిమా షూటింగ్ సంగతులు పంచుకున్నారు శ్రీయ. సినీ కెరీర్ మొదలుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన శ్రీయ.. పోటీ ప్రపంచంలో హీరోయిన్‌గా ఇంతకాలం కొనసాగడం సాధారణ విషయం కాదని అన్నారు. ఇప్పుడు సినిమా పట్ల తన దృక్పథం మారిందని, తాను నటించిన సినిమాలు చూసి ఫ్యామిలీ గర్వపడేలా ఉండే కథలనే ఎంచుకుంటున్నానని చెప్పారు. అలా గమనం కథ విన్న వెంటనే తన కంట్లో నీళ్లు తిరిగాయని, వెంటనే ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యానని అన్నారు. ఈ మూవీలో తనది దివ్యాంగురాలి పాత్ర అని, ఈ క్యారెక్టర్‌లో లీనమై పోవడం కోసం క్లాసులకు కూడా వెళ్లానని శ్రీయ తెలిపారు. అయితే ఈ సినిమా షూటింగ్ చేస్తుండగానే తన ఫ్రెండ్ చనిపోయారని, ఆ వార్త తెలిసి తన గుండె బద్దలైపోయిందని చెబుతూ శ్రీయ ఎమోషనల్ అయ్యారు. అయినా ఆ బాధలోనే షూటింగ్ కంప్లీట్ చేశానని, గమనం మూవీలో ఈ పాత్రను పోషించడం తనకు ఎంతో సంతోషాన్నిచిందని శ్రీయ అన్నారు. ఈ గమనం సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రీయ, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ కీలక పాత్రలు పోషించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pEOVpQ
No comments:
Post a Comment