రొమాంటిక్ సినిమాతో కుర్రాళ్ల గుండెలను గిలిగింతలు పెట్టేసింది. సినిమా విడుదల కాక ముందే కేతికకు భారీ ఫాలోయింగ్ వచ్చేసింది. ఆ క్రేజ్ వల్లే మొదటి చిత్రం విడుదల కాకముందే రెండు ప్రాజెక్ట్‌లు చేతిలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు కేతిక నటించిన సినిమ ా విడుదలకు సిద్దంగా ఉంది. డిసెంబర్ 10న లక్ష్య విడుదల కాబోతోంది. తాజాగా కేతిక మీడియాతో ముచ్చటిస్తూ నాటీ కామెంట్లు చేసింది. రొమాంటిక్ సినిమాను సినిమా అని ఓకే చెప్పాను. పూరి జగన్నాథ్ ఆపీస్ నుంచి కాల్, ఆయన సినిమా అంటే కాదని చెప్పలేం. అందుకే రొమాంటిక్ సినిమాను చేశాను. అందులో పూర్తి గ్లామర్ రోల్ అయితే లక్ష్య సినిమాలో పూర్తిగా భిన్నంగా కనిపిస్తాను అంటూ తన పాత్ర గురించి కేతిక చెప్పుకొచ్చింది. కరోనా వల్ల ఇలా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ వచ్చాయి. రొమాంటిక్ సినిమా షూటింగ్ చివరి రోజు. షూట్ మొత్తం పూర్తయింది. సంతోష్ గారు కలిసి ఓ కథ చెప్పారు. అదే రోజు ఓ సినిమా షూట్ పూర్తవ్వడం, ఇలా వెంటనే మరో కథ రావడం ఆనందంగా అనిపించింది. రొమాంటిక్ చిత్రంలో చేసిన పాత్రకు, లక్ష్య సినిమాలో చేసిన కారెక్టర్‌కు సంబంధం ఉండదు. నా నటనలోని వైవిధ్యాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను ఒప్పుకున్నాను. లక్ష్య సినిమాలో రితిక పాత్రను పోషించాను. ఆమె తన మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తుంది. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను. లక్ష్య చిత్రం పార్దు చుట్టూ తిరుగుతుంది. అతన్ని ప్రేమించే పాత్రలో రితిక కనిపిస్తుంది. ఆమెకు ప్రేమ, పెళ్లి అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. రితికలానే నేను కూడా ఉంటాను. నా మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తాను. అలా మనసుకు ఏది తోచితే అదే చేసే వాళ్లను భరించడం కష్టం. మాతో అంత ఈజీ కాదంటూ కేతిక నాటీ కామెంట్లు చేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GdHJbc
No comments:
Post a Comment