సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ అనే సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. నాగ చైతన్యతో పెళ్లి మొదలు మొన్నటిదాకా అక్కినేని ఫ్యామిలీ, తనకు సంబంధించిన అన్ని విషయాలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా పలు ఫొటోస్, వీడియోస్ షేర్ చేసుకునే సామ్.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలను తలదన్నేలా అరుదైన ఫీట్ సాధించింది. ఆన్ లైన్ మాధ్యమాలను విరివిగా ఉపయోగిస్తూ నెట్టింట భారీ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో సమంత రూత్ ప్రభు ఒకరు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె సోషల్ మీడియా ఖాతాలకు మరింత డిమాండ్ పెరిగింది. క్రమంగా మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ పోగయ్యారు. ఈ క్రమంలోనే మరో మైల్ స్టోన్ దాటేసింది సామ్. ఇన్స్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్ ఫాలోవర్స్ మార్కును ఆమె దాటేసింది. దీంతో సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ లోని హీరోయిన్లలో అత్యధిక ఫాలోయింగ్ కలిగిన వ్యక్తుల్లో ఒకరిగా ఆమె అవతరించింది. ఇంతకు ముందే కాజల్ కూడా ఆ మార్క్ దాటిన సంగతి తెలిసిందే. అయితే ఫాలోవర్స్ పరంగా మేల్ స్టార్ హీరోల్లో ముందు వరుసలో ఉన్న అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలను సమంత దాటేయడం చెప్పుకోదగ్గ అంశం. సమంత ఈ అరుదైన ఫీట్ అందుకోవడం పట్ల ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. చైతూతో విడాకుల ప్రకటన తర్వాత స్పీడు పెంచిన సమంత, 'పుష్ప' మూవీలో ఐటెం సాంగ్ చేయడంతో పాటు మరో రెండు సినిమాలకు కమిటైంది. అలాగే ఓ హాలీవుడ్‌లో కూడా నటిస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించింది సామ్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ogIgms
No comments:
Post a Comment