అఖండ.. మాస్, ఫ్యాన్స్ మెచ్చే సినిమా

Movie: నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌లనాల‌ను సృష్టించాయి. మాస్ హీరోగా బాల‌య్య‌ను వెండితెర‌పై ఆవిష్క‌రించ‌డంలో బోయ‌పాటి శ్రీను త‌న‌దైన మార్కును చూపించి అంద‌రితో శ‌భాష్ అనిపించుకున్నారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మూడో సినిమాగా ‘అఖండ‌’ను అనౌన్స్ చేయ‌గానే అభిమానులు సంతోష‌డ్డారు. ఆటోమెటిక్‌గా సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. అస‌లు బోయ‌పాటి ఈసారి బాల‌కృష్ణ‌ను ఎలా చూపిస్తాడోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూశారు. త‌న గ‌త రెండు చిత్రాల త‌ర‌హాలోనే ఈ సినిమాలో బాల‌కృష్ణ‌తో ద్విపాత్రాభిన‌యం చేయించారు బోయపాటి. సినిమా పోస్టర్స్‌, బాల‌కృష్ణ లుక్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమా ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత పెంచాయి. డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం మ‌రి ఈ అంచనాల‌ను ఏ మేర‌కు అందుకుందో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం... క‌థ‌: గ‌జేంద్ర సాహు అనే పేరు మోసిన టెర్ర‌రిస్ట్ పోలీసుల ఎన్‌కౌంట‌ర్ నుంచి త‌ప్పించుకుని మ‌హారుద్ర పీఠంను చేరుకుంటాడు. త‌న‌ను ఇబ్బంది పెట్టిన ఈ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని పీఠాధిప‌తిని చంపి తానే పీఠాధిప‌తిగా మారుతాడు. అదే స‌మ‌యంలో అనంత‌పురంలో రామచంద్ర‌రాజు అనే వ్య‌క్తికి మ‌గ క‌వ‌ల‌లు పుడ‌తారు. వారిలో ఓ బిడ్డ ఊపిరి పోసుకుంటే, మ‌రో బిడ్డ ఉలుకు ప‌లుకు లేకుండా ఉంటాడు. అదే స‌మ‌యంలో వారింటిలోకి అడుగు పెట్టిన అఘోరా (జ‌గ‌ప‌తిబాబు) చ‌నిపోయిన బిడ్డ‌ను తీసుకెళ్లిపోతాడు. చ‌నిపోయిన బిడ్డ కాశీ విశ్వ‌నాథుడి స‌న్నిధానానికి చేరుకుంటాడు. ప‌ర‌మేశ్వ‌రుడి దయ‌తో ఆ బిడ్డ ఊపిరి పోసుకుంటుంది. కొన్నేళ్ల త‌ర్వాత ఆ పిల్ల‌లు పెరిగి పెద్ద‌వార‌వుతారు. అనంత‌పురంలో పెరిగిన బిడ్డ ముర‌ళీకృష్ణ (నంద‌మూరి బాల‌కృష్ణ‌) అక్క‌డ ఫ్యాక్ష‌నిజం రూపుమాప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు. ఆ ప్రాంతంలో స్కూల్స్‌, హాస్పిటల్స్ క‌ట్టించి ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంటాడు. ముర‌ళీ కృష్ణ చేసే మంచి ప‌నులు చూసి ఆ ప్రాంతానికి వ‌చ్చిన కలెక్ట‌ర్ శ‌రణ్య (ప్ర‌గ్యా జైశ్వాల్‌) అత‌న్ని ప్రేమిస్తుంది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకుంటారు. మ‌రో వైపు.. అదే ప్రాంతంలో కాప‌ర్ మైనింగ్ వ్యాపారం చేసే వ‌ర‌దరాజులు (శ్రీకాంత్‌)కి, త‌న మైన్‌లో యురేనియం ఉంద‌ని తెలియ‌డంతో దాన్ని వెలికి తీసే ప‌నుల్లో బిజీగా ఉంటాడు. అక్కడ వ‌చ్చే వ్య‌ర్థాల‌ను భూమిలోకి పంపేయ‌డంతో చిన్న పిల్ల‌లు చనిపోతారు. విష‌యం తెలుసుకున్న ముర‌ళీ కృష్ణ ..వ‌ర‌దరాజుల‌కి ఎదురెళ‌తాడు. అప్పుడు ఓ ప్లానింగ్ ప్ర‌కారం జ‌రిగిన ప‌రిస్థితుల న‌డుమ ముర‌ళీ కృష్ణ క‌ట్టించిన హాస్పిట‌ల్‌లో బాంబ్ పేలుతుంది. మినిష్ట‌ర్ చ‌నిపోతాడు. దాంతో ముర‌ళీకృష్ణ‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. శ‌రణ్య‌ను చంప‌డానికి వ‌ర‌ద‌రాజులు ప్ర‌య‌త్నిస్తాడు. అప్పుడే రంగ ప్ర‌వేశం చేస్తాడు. అస‌లు అఖండ ఎవ‌రు? వ‌ర‌ద‌రాజుకి ఎందుకు ఎదురెళతాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేష‌ణ‌: అన్యాయం జ‌రిగి అమాయ‌కులు, చిన్న పిల్ల‌లు అకార‌ణంగా చనిపోతున్న‌ప్పుడు అక్క‌డ‌కు దేవుడు ఏదో ఒక రూపంలో వ‌చ్చి ఆదుకుంటాడు అనే పాయింట్‌ను మ‌రోసారి బోయపాటి శ్రీను అఖండ రూపంలో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ఈసారి అఘోర పాత్ర‌ను త‌న క‌థ‌కు లింక్ చేసి చేయ‌డం విశేషం. సింహా, లెజెండ్ చిత్రాల్లో బాల‌కృష్ణ ప‌వ‌ర్‌ఫుల్‌గా చూపించిన బోయ‌పాటి శ్రీను ఈసారి ఆయ‌న్ని తెర‌పై ఎలా ఆవిష్క‌రిస్తారోన‌ని ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఇంత‌కు ముందు ప్ర‌స్తావించిన‌ట్లు సింహా, లెజెండ్ త‌ర‌హాల్లో మ‌రోసారి బాల‌య్యను డ్యూయెల్ రోల్‌లో చూపించాడు బోయ‌పాటి. ఒక పాత్ర‌ను రాయ‌ల‌సీమ రైతుగా ఎలివేట్ చేస్తే మ‌రోటి అఘోర పాత్ర‌. ఈ రెండు పాత్ర‌ల‌ను బ్యాలెన్స్ చేస్తూ త‌ను చెప్పాల‌నుకున్న ఎలిమెంట్‌ను మాస్‌కు, ఫ్యాన్స్‌కు క‌నెక్ట్ అయ్యేలా డైలాగ్స్‌తో, యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో బోయ‌పాటి అఖండ‌ను తెర‌కెక్కించారు బోయపాటి శ్రీను. అఖండ, మురళీ కృష్ణ పాత్ర‌ల‌కు అంతే ప‌వ‌ర్‌ఫుల్‌గా త‌న‌దైన పవర్‌ఫుల్, మాస్ న‌ట‌న‌తో, డైలాగ్ డెలివరీతో ప్రాణం పోశారు హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఫ‌స్టాఫ్ అంతా రాయ‌ల‌సీమ పాత్ర‌ధారి మురళీకృష్ణ పైనే ఎక్కువగా క‌థ ర‌న్ అవుతుంది. అనంత‌పురంలో ఫాక్ష్య‌నిజం రూపుమాప‌డానికి పాటు ప‌డే రైతు మురళీ కృష్ణ పాత్ర‌లో ధీరోదాత్తుడిగా బాల‌కృష్ణ క‌నిపించారు. యాక్ష‌న్ సీన్స్‌లోనూ బాల‌య్య న‌ట‌న మ‌రో రేంజ్‌లో ఉంటుంది. ప్ర‌తి సీన్ ఎలివేష‌న్ సీన్‌ రేంజ్లో మ‌లిచారు డైరెక్ట‌ర్‌. ఇక ఇంట‌ర్వెల్ ముందు అఖండ పాత్ర ఎంట్రీ ఉంటుంది. ఆ పాత్ర ఎంట్రీ త‌ర్వాత యాక్ష‌న్ పార్ట్ ఎక్కువ‌గా అనిపిస్తుంది. క‌థానుగుణంగా విల‌న్స్ భ‌ర‌తం ప‌డుతూ సంద‌ర్భానుసారం చెప్పే డైలాగ్స్‌కు థియేటర్స్‌లో విజిల్స్ ప‌డ‌టం ఖాయం. త‌మ‌న్ త‌న సంగీతంతో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. జై బాల‌య్య సాంగ్ అంద‌రినీ మెప్పిస్తుంది. అలాగే బాల‌కృష్ణ‌, ప్ర‌గ్యా మ‌ధ్య వ‌చ్చే అడిగా అడిగా సాంగ్‌.. రొమాంటిక్‌గా సాగుతుంది. ఇదే పాట‌లో క‌థ‌ను ఇంకాస్త ముందుకు తీసుకెళ్లారు డైరెక్ట‌ర్ బోయ‌పాటి. సెకండాఫ్‌లో ఎమోష‌న‌ల్‌గా సాగే మ‌రో సాంగ్ వ‌స్తుంది. త‌మ‌న్ నేప‌థ్య సంగీతం.. ముఖ్యంగా అఖండ పాత్ర‌కు ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్ర‌ధాన ఆయువుగా నిలిచింది. రాం ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ఎప్ప‌టిలాగానే బాల‌కృష్ణ‌, బోయ‌పాటి సినిమాకు ఎం.ర‌త్నం మాట‌లు ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. విధికి, విధాత‌కు స‌వాళ్లు విస‌ర‌కూడ‌దుఒక మాట నువ్వంటే శ‌బ్దం అదే నేనంటే శాస‌నందేవుణ్ని క‌రుణించ‌మ‌ని అడ‌గాలి క‌నిపించ‌మ‌ని కాదునిన్ను అంచ‌నా వేయ‌డానికి నువ్వేమైనా పోలవ‌రం డ్యామా.. ప‌ట్టిసీమ తూమా.. పిల్ల కాలువ‌వి..ప‌లు సంద‌ర్భాల్లో సాధార‌ణ మ‌నుషులు, యోగులు ఎలా ఉంటారో చెప్పే బోత్ ఆర్ నాట్ సేమ్ అనే సిట్యువేష‌న‌ల్ డైలాగ్ ఇలా.. పలు సంద‌ర్భాల్లో ఎం.ర‌త్నం డైలాగ్స్ స‌న్నివేశాల‌కు బ‌లాన్నిచ్చాయి. బోయ‌పాటి స‌న్నివేశాల‌ను ఎలివేట్ చేసిన తీరు సింహా, లెజెండ్‌కు మించి ఉంది. అందుకు కార‌ణం.. ఈసారి ఆయ‌న క్యారెక్ట‌ర్స్ ఎలివేష‌న్‌పై ఫోక‌స్ పెట్ట‌డ‌మే. అఖండ పాత్రలో బాల‌య్య ప్రతి సీన్‌ను ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌లా చూపించే ప్ర‌య‌త్నం చేశారు డైరెక్టర్ బోయపాటి. ఇక రాయ‌ల‌సీమ పాత్ర‌ధారిగా బాల‌య్య చేసిన పాత్ర ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌లో కోడెద్దులు ప‌రిగెత్తుకుంటూ వ‌స్తుంటే వాటి మ‌ధ్య నుంచి ఆయ‌న న‌డిచి వ‌చ్చిచేసిన ఫైట్ ఫ్యాన్స్‌, మాస్‌ను ఆక‌ట్టుకుంటుంది. ఇక సినిమాలో ఫ‌స్టాఫ్ లెంగ్తీగా అనిపిస్తుంది. అలాగే సినిమాలో వ‌యొలెన్స్ డోస్ ఎక్కువైంది. అఖండ పాత్ర‌ధారి అంద‌రినీ చంపుకుంటే వెళ్లిపోతుంటాడు. ఆయ‌న్ని పోలీసులు ఏమీ అన‌రు. ఎన్ఐఏ ఆఫీస‌ర్ ప్ర‌శ్నిస్తున్నా బాల‌కృష్ణ స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డం.. క్లైమాక్స్‌లో అఖండ పాత్ర‌ధారిని చంపాల‌నుకున్న విల‌న్స్ ద‌గ్గ‌ర గ‌న్స్ ఉన్నా.. ఎందుక‌నో క‌త్తులు, గొడ‌ళ్ల‌ను ఉప‌యోగించ‌డం.. ఇలా కొన్ని సీన్స్ అన్‌లాజిక‌ల్‌గా అనిపిస్తాయి. లాజిక‌ల్‌గా క‌రెక్ట్ కాక‌పోయినా.. క‌మ‌ర్షియ‌ల్ మూవీ కాబ‌ట్టి ఓకే అనుకోవాల్సిందే. ప్ర‌గ్యా జైశ్వాల్ పాత్ర ప‌రిధి మేర‌కు చ‌క్క‌గా న‌టించింది. పూర్ణ పాత్రకు స్కోప్ త‌క్కువే. అయితే ఉన్నంత‌లో చ‌క్క‌గా న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు కూడా అఘోర బాబాగా చిన్న పాత్ర‌లోనే క‌నిపించాడు. ఇక మిగిలిన పాత్ర‌ధారులంద‌రూ కూడా ఓకే అనిపించారు. శ్రీకాంత్ విల‌నిజాన్ని చ‌క్క‌గానే చూపించారు. అయితే లెజెండ్‌లో జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌కున్న స్కోప్ శ్రీకాంత్ పాత్ర విల‌నిజంలో క‌నిపించ‌దు. కూల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను చూడాల‌నుకునే ప్రేక్ష‌కులు సినిమాలో మాస్ ఎలిమెంట్స్‌కు క‌నెక్ట్ కారు. అఖండ... మాస్‌ ఆడియెన్స్, నంద‌మూరి ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే మూవీ


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dgxEgQ

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts