నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ వచ్చేసింది. సినిమాతో దుమ్ములేపేశారు. ఇప్పటికే సింహా, లెజెండ్ సినిమాలతో బాలయ్య బోయపాటి రికార్డులు బద్దలు కొట్టేశారు. ఇక ఇప్పుడు అఖండతో మాస్ జాతరను చూపించేశారు. మొత్తానికి థియేటర్లు మాత్రం జాతరను తలిపిస్తున్నాయి. అఖండ విడుదలైన ప్రతీ చోటా పండుగ వాతావరణం కనిపించింది. ఇక సెకండ్ లాక్డౌన్ తరువాత విడుదలైన పెద్ద సినిమా, ఈ రేంజ్‌లో సక్సెస్ అవ్వడంతో ఇండస్ట్రీలో సంబరాలు నెలకొన్నాయి. అఖండ ఇలా హిట్ అవ్వడంతో రాబోయే సినిమాల్లో మంచి ఉత్సాహం నింపుతున్నట్టు అయింది. తాజాగా అఖండ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. దీనిపై సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇస్మార్ట్ హీరో పోస్ట్‌లు పెట్టేశారు. అఖండ చిత్రయూనిట్‌కు కంగ్రాట్స్ తెలిపారు. అఖండతో అద్భుతమైన ఆరంభం.. ఎంతో సంతోషంగా ఉంది. , బోయపాటి శ్రీను గారికి, చిత్రయూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ అని ట్వీట్ వేశాడు. ఇక ఇస్మార్ట్ హీరో రామ్ సైతం అఖండ విజయోత్సవాల మీద స్పందించాడు. అఖండ గురించి అద్భుతమైన స్పందన వినిపిస్తోంది.. బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారికి, ద్వారకా క్రియేషన్స్, తమన్, ప్రగ్యా జైస్వాల్ అందరికీ కంగ్రాట్స్. తెలుగు సినిమా వేవ్ మళ్లీ మొదలైంది అని రామ్ ట్వీట్ వేశాడు. మొత్తానికి బీబీ3 అంటూ వచ్చిన అఖండ దెబ్బకు థియేటర్లు దద్దరిల్లిపోతోన్నాయి. అఘోర పాత్రను బోయపాటి మలిచిన తీరు, ఆ యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్స్, తమన్ నేపథ్య సంగీతం ఇలా ప్రతీ ఒక్కటీ మాస్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇక మున్ముందు రాబోయే పెద్ద సినిమాలతో థియేటర్ల వద్ద హంగామా ఉండనుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rzzSRb
No comments:
Post a Comment