ప్రేమ ప్రయాణంలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతారకు మంచి అనుభవమే ఉందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఆమె ప్రేమ సంగతులు, పెళ్లి ముచ్చట్లకు నిత్యం వార్తల్లో ఎంతో కొంత స్పేస్ ఉండటం కామన్ అయింది. ప్రస్తుతం తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడిపిస్తున్న నయన్.. చాలాకాలంగా తన ప్రియుడితో చెట్టాపట్టాలేసుకు తిరుగుతోంది. ఎట్టకేలకు రీసెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న ఆమె భారీ ఖర్చుతో న్యూ హౌస్ ప్లాన్ చేస్తోందని కోలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం చెన్నై నగరంలోని ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న త్వరలోనే కొత్త ఇంటికి మకాం మార్చనున్నట్లు సమాచారం. కొత్త ఇల్లు కోసం పలు ఖరీదైన లొకేషన్స్ సెర్చ్ చేసిన ఆమె.. చివరకు పోయస్ గార్డెన్‌లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిందని తెలుస్తోంది. రజనీకాంత్, ధనుష్ వంటి సెలబ్రిటీల ఇల్లు ఉన్న ఈ ఏరియాలో కాబోయే భర్తతో నివసించాలని ఆమె ప్లాన్ చేసుకుంటోందట. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ ఇంటిలో నాలుగు బెడ్ రూమ్స్ ఉన్నారట. ఖరీదైన ఇంటీరియర్‌తో ఆ ఇంటిని మరింత ముస్తాబు చేయిస్తోందట నయన్. ఈ ఇంటి కోసం నయన్ పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టిందని అంటున్నారు. త్వరలోనే విగ్నేష్ శివన్‌తో కలిసి ఆమె గృహ ప్రవేశం చేయబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు నయన్- విగ్నేష్ శివన్ వచ్చే ఏడాది మూడు మూళ్ళ బంధంతో ఒక్కటి కానున్నారని తెలుస్తున్న నేపథ్యంలో నయన్ కొత్త ఇల్లు కొనుగోలు చేసిందని తెలుస్తుండటం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. కెరీర్ పరంగా చూస్తే.. హీరోయిన్‌గా నటిస్తూనే తనకు కాబోయే భర్త విగ్నేష్ శివన్‌తో కలిసి కొన్ని సినిమాల నిర్మాణంలో భగమవుతోంది నయనతార. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో పాటు మరో రెండు తమిళ చిత్రాలతో బిజీగా ఉంది నయన్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pjxD1r
No comments:
Post a Comment