ముంచుకొస్తున్న ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రతిసారి సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు తమ వంతు సాయం ప్రకటిస్తూ వస్తున్నారు. రీసెంట్‌గా కురిసిన భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. పలు చోట్ల వరదలు పోటెత్తడంతో ఇల్లు, కాలనీలు జలమయమయ్యాయి. దీంతో ఎంతోమంది ఆశ్రయం కోల్పోయారు. ఇలాంటి కష్ట కాలంలో ఏపీ ప్రజలకు అండగా నిలిచారు . వరద బాధితుల సహాయార్థం ముందుగా హీరో ఎన్టీఆర్ ముందడుగు వేసి 25 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. వరదల కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి సాయం చేసే దిశగా నేను చిన్న అడుగు వేశానంటూ తన ప్రకటన రిలీజ్ చేశారు. ఆ వెంటనే చిరంజీవి, మహేష్ బాబు కదలివచ్చి సీఎం రిలీఫ్ ఫండ్‌కి చెరో 25 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. తాజాగా ఇదే బాటలో అల్లు అర్జున్ తన సాయాన్ని ప్రకటించి మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని తెలుపుతూ.. తన వంతు సాయంగా ఏపీ రిలీఫ్ ఫండ్‌కి 25 లక్షల విరాళం అందిస్తున్నానని పేర్కొంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్. గతంలో కూడా చాలా సార్లు ఇలా పలు ప్రకృతి వైపరీత్యాలతో నిరాశ్రయులైన ప్రజలకు అండగా నిలుస్తూ ఆర్ధిక సాయం చేశారు బన్నీ. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా సమంత ఐటెం సాంగ్ చేస్తోంది. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 17న ఈ సినిమా రిలీజ్ కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lswbsi
No comments:
Post a Comment