యంగ్ యూట్యూబర్, నటి గుండెపోటుతో మరణించారు. సోమవారం రాత్రి సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే తుది శ్వాస విడిచారు. ఊహించని విధంగా 27 ఏళ్ల వయసులోనే ఆమె కార్డియాక్ అరెస్ట్‌కు గురికావడం పలువురిని కలచివేసింది. ఆమె హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘పెళ్లి చూపులు’ రియాలిటీ షోలో శ్రియ మురళీధర్ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు శ్రియా మురళీధర్. ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్ చేసి మంచి పేరు సంపాదించారు. అలాగే ‘బ్యూటీ అండ్ ద బాస్’ సీజన్ 2లోనూ ఆమె నటించారు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ గా ఆమె మెప్పించారు. నటన అంటే ఎంతో ఇష్టపడే శ్రియ మురళీధర్ స్వస్థలం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్. వాట్ ద ఫన్ (What the fun) యూట్యూబ్ ఛానల్‌లో ఆమె పలు వీడియోలు చేసి ఫేమస్ అయ్యారు. బిగ్ స్క్రీన్ పై కూడా రాణించాలని కలలు గన్న ఆమెకు ఈ మధ్యనే ఆమెకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయట. కానీ ఆ కల నెరవేరకుండానే కన్నుమూశారు శ్రీయా. ఆమె మృతి పట్ల దీప్తీ సునయన, సినీ నటి సురేఖ కుమార్తె సుప్రిత ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Glq9Sz
No comments:
Post a Comment