సాహిత్య దిగ్గజం, ఫేమస్ లిరిక్ రైటర్ ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే సిరివెన్నెల కలం నుంచి జాలువారిన చివరి అక్షరాలతో '' సినిమాలోని 'సిరివెన్నెల' సాంగ్ రిలీజ్ అయింది. ''నెల రాజునీ .. ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల'' అంటూ అద్భుతమైన సాహిత్యంతో సాగిపోతున్న ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించగా మిక్కీ జే మేయర్ బాణీలు కట్టారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సాంగ్ గురించి రియాక్ట్ అవుతూ ఎమోషనల్ అయింది . ''మీరు రాసిన ప్రతి పదం మీ ఆత్మను తీసుకు వస్తోంది. ఎప్పటికీ మీరు మా హృదయాల్లో జీవించే ఉంటారు సార్'' అని పేర్కొంటూ 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలోని ఆ పాటను షేర్ చేసింది సాయి పల్లవి. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి చివరి పాట అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. నాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రెండు పాటలు రాశారు. అయితే ఆయన రాసిన ఆఖరి పాట ఈ 'సిరివెన్నెల' అని చిత్ర యూనిట్ తెలిపింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మరో ఇద్దరు హీరోయిన్లు కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన దర్శకనిర్మాతలు.. సరికొత్త అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3EDkHKd
No comments:
Post a Comment