'లవ్ స్టోరీ' సినిమాతో సక్సెస్ ఖాతాలో వేసుకున్న ప్రస్తుతం తన తండ్రి నాగార్జునతో కలిసి 'బంగార్రాజు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. గతంలో వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టిన చిత్రయూనిట్ ఒక్కొక్కటిగా అప్‌డేట్స్ వదులుతూ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రంలోని బంగార్రాజు పార్టీ సాంగ్ అప్‌డేట్ ఇస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాటలో అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్యలతో కలిసి 'జాతి రత్నాలు' బ్యూటీ చిందులేయడం విశేషం. అయితే ఈ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన నాగ చైతన్య.. ఇది ఫస్ట్ మ్యూజికల్ పోస్టర్ అని, డిసెంబర్ 17న ఈ సాంగ్ టీజర్ రిలీజ్ కానుందని తెలిపారు. పోస్టర్ చూస్తుంటే మాత్రం ఫరియాతో తండ్రీకొడుకులు రెచ్చిపోయి చిందేశారని అర్థమవుతోంది. ఈ మూవీలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్య జంటగా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటిస్తోంది. నాగార్జున సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగలక్ష్మి పాత్రలో కృతి శెట్టి కనిపించనుంది. రీసెంట్‌గా విడుదల చేసిన ఆమె లుక్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. రొమాన్స్, ఎమోషన్స్, అన్నిరకాల కమర్షియల్ అంశాలు జోడించి ఈ 'బంగార్రాజు' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జనవరి నెలలో సినిమాను రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DSk66i
No comments:
Post a Comment