హైదరాబాద్ నగరంలో రెసిడెన్షియల్ పరంగా ఖరీదైన ప్రాంతం జూబ్లీ హిల్స్. ఇక్కడ సినీ తారలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు ఇలా ప్రముఖులందరి ఇళ్లు ఉంటాయి. ఈ ప్రాంతంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఖరీదైన ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మహేష్ ఆయన సన్నిహితులు ఈ వార్తలపై మాత్రం స్పందించలేదు. సోషల్ మీడియాలో హల్ చేస్తున్న వార్తల మేరకు విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి మహేష్ 1442 గజాల స్థలాన్ని కొన్నారు. దీని కోసం ఆయన రూ.26 కోట్లు వెచ్చించారు. ఇందులో స్టాంప్ డ్యూటీ కింద రూ.1.43 కోట్లు, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ కింద రూ.39 లక్షలు చెల్లించారు. ఈ ఏడాది నవంబర్‌లోనే కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేష్ కథానాయకుడిగా పరశురాం దర్శకత్వంలో రూపొందుతోన్న సర్కారువారి పాట చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదలవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీని తర్వాత మహేష్ మరో రెండు క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు. అందులో ఒకటి త్రివిక్రమ్ దర్శకత్వంలో.. రెండోది దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో.ఈ రెండింటిలో ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మూవీ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్.నారాయణ నిర్మాతగా రాజమౌళి సినిమాను నిర్మిస్తాడు. రీసెంట్‌గానూ ఈ సినిమా గురించి జక్కన్న ప్రస్తావించాడు. ఆర్ఆర్ఆర్ తర్వాతే మహేష్ సినిమా గురించి ఆలోచన చేస్తానని ఆయన తెలియజేశాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం ఇటు మహేష్ అభిమానులు.. అటు తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే మహేష్ కేవలం సినిమాలపైనే ఫోకస్ పెట్టడం లేదు. సినిమాలతో పాటు పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నాడు. ఇప్పటికే ఏఎంబీ సినిమాతో పాటు టెక్స్‌టైల్ బ్రాండ్ స్టార్ట్ చేసిన మహేష్.. టాప్ బ్రాండ్ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33gpinL
No comments:
Post a Comment