
ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు? ఏ పని చేస్తారు? అనేది ఎవ్వరూ చెప్పలేరు.ఇక నెటిజన్లు అయితే వర్మను ఓ రేంజ్‌లో ఏకిపారేస్తుంటారు. సమయం సందర్భం లేకుండా ఏదైనా పోస్ట్‌లు పెడితే.. వోడ్కా తాగేసి పెట్టి ఉంటారని సెటైర్లు వేస్తుంటారు. అయితే తాజాగా వర్మ చేసిన ఓ పోస్ట్, షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. తాను తీసిన రక్త చరిత్ర సినిమా నాటి సంగతులను వర్మ గుర్తు చేసుకున్నారు. రక్త చరిత్ర రెండో భాగంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే మొదటి పార్ట్ అంతటి స్థాయిలో రెండో భాగం అలరించలేకపోయింది. కానీ సూర్య నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అలా వర్మ దర్శకత్వంలో సూర్య నటించేశారు. అయితే తాజాగా వర్మ రక్తచరిత్ర షూటింగ్‌లో భాగంగా సూర్యతో ముచ్చట్లు పెడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇలా సమయం సందర్భం లేకుండా వర్మ ఎందుకు సూర్య ఫోటోను షేర్ చేశారు? ఏదైనా కారణం ఉందా? మళ్లీ సినిమాను చేయబోతోన్నారా? అసలు మ్యాటర్ ఏంటి? లేక వర్మకు తాగింది దిగలేదా? అని నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే వీటిపై వర్మ స్పందించి సమాధానాలు చెబుతారా? లేదా? అన్నది చూడాలి. అసలే ఇప్పుడు సూర్య తెలుగులో నేరుగా ఓ చిత్రం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. త్రివిక్రమ్, బోయపాటి వంటి వారితో సినిమా చేయాలని సూర్య మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు సూర్య తన 40వ చిత్రాన్ని పాండియన్‌తో చేస్తున్నారు. ఆకాశం నీ హద్దురా సినిమాతో సూర్య మళ్లీ ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UsfG55
No comments:
Post a Comment