యాంకర్ రష్మీ- .. ఈ ఇద్దరి రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. బుల్లితెరపై ఆ ఇద్దరి వర్కవుట్స్, కెమిస్ట్రీ చూసి వాళ్లిద్దరూ లవ్ ట్రాక్ నడిపిస్తున్నారని ఓ రేంజ్ పుకార్లు బయటకొచ్చాయి. అయితే వాటిని తిప్పికొట్టిన ఈ బుల్లితెర స్టార్స్ కెమెరా ముందు మాత్రం అదే రేంజ్ కెమిస్ట్రీతో సందడి చేస్తున్నారు. అలా రష్మీ- సుధీర్ లను చూసి వాళ్ళు చేసుకుంటున్న కామెంట్స్ చూసి జనాల్లో మళ్ళీ అనుమానాలు ముదురుతున్నాయి. తాజాగా విడుదలైన ‘ఢీ 13: కింగ్స్ వర్సెస్ క్వీన్స్’ రియాలిటీ షో ప్రోమోతో మరోసారి ఈ ఇద్దరి అంశం తెరపైకి వచ్చింది. ఓ వ్యక్తిని నిక్ నేమ్‌తో పిలవాలంటే వాళ్ళ మధ్య ఎంతో రిలేషన్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. తనకు నచ్చిన వ్యక్తిని అసలు పేరుకు బదులుగా ముద్దుగా నిక్ నేమ్‌తో పిలుస్తుంటారు. అది స్నేహ బంధంలో అయినా ప్రేమ బంధంలో అయినా నిక్ నేమ్ అనేది వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ తెలుపుతుంటుంది. తాజా ప్రోమోలో అదే చేస్తూ అందరి ముందే ఓపెన్ అయింది . సుధీర్‌ని ఇకపై ఇలానే పిలుస్తానంటూ అతని నిక్ నేమ్ బయటపెట్టేసింది. జూన్ 30వ తేదీ టెలికాస్ట్ అయ్యే 'ఢీ' ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. ఇందులో సుధీర్‌ని ఇక నుంచి 'సుట్టి' అని పిలుస్తా అంటూ రష్మి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె అలా అనడంతో సుధీర్ కూడా వెల్‌కమ్ అన్నట్లుగా రియాక్ట్ కావడం ఈ వీడియోలో హైలైట్ అయింది. ఆ వెంటనే రష్మీ- సుధీర్ ఇద్దరూ కలిసి ‘ఆట’ సినిమాలోని ‘ఏం చాందిని రా’ అనే రొమాంటిక్ సాంగ్‌కి డ్యాన్స్ చేసి మరింత ఆకర్షించారు. ఇక ఇదే వీడియోలో ప్రియమణి ఇచ్చిన ఫ్లైయింగ్ కిస్ మరో హైలైట్ సీన్ అయింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xPAgKV
No comments:
Post a Comment