సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత విద్వాంసులు రెండో కుమారుడు రత్న కుమార్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేరిన ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కరోనా బారిన పడినా.. దాన్ని జయించారు. రెండు రోజుల క్రితమే నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అయితే చాలాకాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్‌పై ఉన్నట్లు సమాచారం. ఇదే క్రమంలో రత్న కుమార్‌కు గుండె నొప్పి రావడంతో కన్నుమూసినట్టు తెలుస్తోంది. 32 ఏళ్లుగా సినీ పరిశ్రమకు ఆయన సేవలు అందించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎన్నెన్నో రికార్డులు కొల్లగొట్టారు. ఆయన మొత్తంగా 1076కి పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. ఏకధాటిగా ఎనిమిది గంటలు నాన్ స్టాప్‌గా డబ్బింగ్ చెప్పి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులకెక్కారు. అంతే కాకుండా తమిళనాడులోనూ ప్రత్యేక రికార్డులు క్రియేట్ చేశారు. తమిళం, తెలుగు, మళయాలం, హిందీ, సంస్కృతం ఇలా అన్ని భాషల్లోనూ డబ్బింగ్ చెప్పేశారు. తెలుగు, తమిళంలో వచ్చే సీరియళ్లలో దాదాపు పది వేల ఎపిసోడ్‌లకు డబ్బింగ్ చెప్పారట. యాభై డాక్యుమెంటరీలకు డబ్బింగ్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే మొదట్లో సింగర్‌గా చాలా ప్రయత్నాలు చేశారట. కానీ సరైన బ్రేక్ రాలేదని చెప్పుకొచ్చేవారు. సింగర్ కొడుకు సింగర్ కావాలన్న రూలేమీ లేదు కదా? అని ఒకసారి తెలుగు సినిమా అయిన కంచి కామాక్షికి తమిళంలో డబ్బింగ్ చెప్పారట. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు రావడం, అదే కెరీర్‌గా మారడం జరిగిందట.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pFWPiE
No comments:
Post a Comment