కొందరు హీరోయిన్స్ కేవలం ఒక్క సినిమాతోనే ఫేమ్ అవుతుంటారు. తొలి సినిమానే వారికి విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెడుతుంటుంది. అలాంటి హీరోయిన్లలో ఒకరు . ఇటీవలే వచ్చిన 'జాతి రత్నాలు' సినిమాలో నవీన్ పోలిశెట్టి సరసన నటించిన ఆమె.. తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. చిట్టిగా ఫరియా నటన అందరినీ అట్రాక్ట్ చేసింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఈ సినిమా తర్వాత అమ్మడికి చెప్పుకోదగిన ఆఫర్స్ మాత్రం రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఓ వార్త నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది. 'జాతి రత్నాలు' బ్యూటీపై డైరెక్టర్ కన్నేశారని, ఆమె కెరీర్ పర్ఫెక్ట్‌గా టర్న్ అయ్యేలా, తాను రూపొందించబోతున్న ఢీ మూవీ సీక్వల్ ఢీ2 లో ఫరియాను హీరోయిన్‌గా తీసుకుంటున్నారని తెలుస్తోంది. మంచు విష్ణు- శ్రీను వైట్ల కాంబినేషన్‌లో 2007 సంవత్సరంలో విడుదలైన 'ఢీ' సినిమా సూపర్ సక్సెస్ కావడమే గాక ప్రేక్షకలోకం మరువలేని చిత్రంగా నిలిచిపోయింది. దీంతో ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ మరోసారి చూడాలని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో 'ఢీ2' తెరకెక్కిచాలని ఫిక్స్ అయిన శ్రీను వైట్ల.. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్స్ ఫినిష్ చేశారని సమాచారం. ఇక మంచు విష్ణుకు తోడుగా నటీనటుల ఎంపికపై ఫోకస్ పెట్టిన ఆయన.. ఫరియా అబ్దుల్లాను హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నారట. మంచు వారబ్బాయితో రొమాన్స్ చేస్తూనే కామెడీ పండించేలా క్రేజీ బ్యూటీ ఫరియాతో మ్యాజిక్ చేయాలని అంతా పక్కాగా స్కెచ్చేశారట శ్రీను వైట్ల. ఇకపోతే ఈ చిత్రానికి ‘ఢీ అండ్ ఢీ’ అనే టైటిల్ ఫైనల్ చేయాలని చూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలుగు ప్రేక్షకులను మరింత ఆకర్షించేలా ''డేరింగ్ అండ్ డాషింగ్'' అనే ట్యాగ్ లైన్ కూడా డిసైడ్ చేశారని టాక్. ఏదేమైనా ఇదే నిజమైతే 'జాతి రత్నాలు' బ్యూటీకి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3voUdXx
No comments:
Post a Comment