టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లోని ముఖ్య విషయాలను సంక్షిప్తంగా ఇలా ఒక్కచోట చేర్చి ఈ సినిమా రౌండప్ ద్వారా మీ ముందుకు తెస్తున్నాం.
ఎప్పటికప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు సెలబ్రిటీల క్రేజీ అప్‌డేట్స్ ఈ సినిమా రౌండప్ ద్వారా మీ ముందుకు తెస్తున్నాం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లోని ముఖ్య విషయాలను సంక్షిప్తంగా ఇలా ఒక్కచోట చేర్చి అందిస్తున్నాం. ఈ రోజు (జూన్ 15) సినిమా రౌండప్‌లో ‘డబ్బూ రత్నాని 2021 క్యాలెండర్’ కోసం విజయ్ దేవరకొండ ఫోటో షూట్, దిశా ఎన్‌కౌంటర్ మూవీపై వర్మ ఇచ్చిన క్లారిటీ, బడా బ్యానర్ ఇచ్చిన క్రేజీ ఆఫర్ కాదన్న సమంత, మరో తెలుగు సినిమాకు రెడీ అయిన తాప్సి, అక్కినేని అఖిల్‌తో మైత్రి వారి సినిమా తదితర విషయాలను పొందుపరిచాం. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విషయాలపై ఓ లుక్కేయండి.
కండలు తిరిగిన దేహంతో విజయ్ దేవరకొండ
ఫేమస్ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్‌లో టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చోటు దక్కించుకున్నారు. ‘డబ్బూ రత్నాని 2021 క్యాలెండర్’లో విజయ్ కనిపించనున్నారు. క్యాలెండర్ షూట్ కోసం బైక్‌పై కూర్చొని మాస్ లుక్‌లో విజయ్ ఫొటోలకు పోజులిచ్చాడు. ఈ ఫొటోల్లో కండలు తిరిగిన దేహంతో అట్రాక్ట్ చేస్తున్నారు. ఇది తెలిసి విజయ్ దేవరకొండ క్రేజ్‌కి ఇదే నిదర్శనం అంటున్నారు నెటిజన్లు.
కుదరందంటున్న సమంత
పెళ్లి తర్వాత సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న సమంత సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ వస్తోంది. ఇటీవలే ది ఫ్యామిలీ మెన్ 2లో అబ్బురపరిచే రోల్ పోషించిన ఈ అమ్మడు.. కొంతకాలంగా గ్లామరస్ పాత్రలకి దూరంగా ఉంటూ నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ పెద్ద బ్యానర్ ఇచ్చిన ఛాన్స్ వదులుకుందట సామ్. భారీ ఆఫర్ ఇచ్చినా కాదనేసిందట.
దిశా ఎన్‌కౌంటర్.. వర్మ క్లారిటీ
‘దిశా ఎన్‌కౌంటర్’ మూవీ రిలీజ్ విషయమై నెలకొన్న అనుమానాలకు చెక్ పెడుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రం రెండు నెలల క్రితమే సెన్సార్ సర్టిఫికేట్‌ను పొందిందని, అయితే సెన్సార్ వారు కొన్ని కట్స్ చెప్పడంతో పాటు టైటిల్ మార్చాలని సూచించారని తెలిపారు. త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. తన కాంట్రవర్సీ సినిమాలేవైనా సెన్సార్ నిబంధనలను పాటించి వారు ఒప్పుకున్నాకనే విడుదలయ్యాయని వర్మ అన్నారు.
మైత్రి నిర్మాతలతో అక్కినేని అఖిల్
ఇటీవలే తన 'మోస్ట్ ఎలిజిబుల్ బాచ్‌లర్' మూవీ ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయ్యాడు యంగ్ హీరో అక్కినేని అఖిల్. అలాగే మరి కొద్దిరోజుల్లో స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే దీంతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో అఖిల్ మరో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందించనున్నారట.
తాప్సి 'మిషన్ ఇంపాజిబుల్'
బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న తాప్సి.. త్వరలో మరో తెలుగు సినిమాలో నటించబోతోందని టాక్. స్వరూప్ దర్శకత్వం వహించబోతున్న 'మిషన్ ఇంపాజిబుల్' చిత్రంలో తాప్సి ప్రధాన పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో తాప్సికి పాత్రకి ఎంతో ప్రాధాన్యముంటుందని, కథ అంతా ఆమె చుట్టే తిరుగుతుంటుందని తెలుస్తోంది. హైదరాబాద్‌లో త్వరలో జరగబోతున్న కొత్త షెడ్యూల్‌లో తాప్సి ఎంటర్ కానుందని అంటున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gnZj1W
No comments:
Post a Comment