హోటల్ రూంలో అలా.. రాత్రంతా ఉంటావని అంటూ నిర్మాత.. నటి సంచలన కామెంట్స్

బాలీవుడ్ నటి ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. తన సినీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, నేర్చుకున్న జీవిత పాఠాలన్నింటిని తన ఆటో బయోగ్రఫీలో పొందుపర్చి పుస్తకంగా మలిచారు. ‘సచ్‌ కహో తా: మేరీ ఆత్మకథ’ అంటూ నీనా గుప్తా పేరు ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఈ క్రమంలో సౌత్ ప్రొడ్యుసర్ వల్ల తాను ఒకానొక సమయంలో ఇబ్బందిపడ్డానని నీనా గుప్తా తెలిపారు. అసలే క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఇప్పుడు ఎంతటి వివాదాస్పదంగా మారాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే ఎదురుతిరిగి, నోరు విప్పి మాట్లాడగలుగుతున్నారు.. ధైర్యంగా బయటకు చెబుతున్నారు. కానీ ఒకప్పుడు పరిస్థితి అలా ఉండేది కాదు. తాజాగా నీనా తనకు జరిగిన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. నేను నటిగా వెండితెరకు పరిచయమైన కొత్తలో ఆఫర్‌ విషయమై దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన పేరు పొందిన నిర్మాతను కలవాల్సి వచ్చిందని అన్నారు. ముంబయిలోని పృథ్వీ థియేటర్‌ పక్కనే ఉన్న ఓ హోటల్‌లో ఆయన బస చేయడంతో.. పాత్ర గురించి వివరిస్తానంటూ తనకు కాల్‌ చేశారట. సరేనని ఆ హోటల్‌కు చేరుకుని రిసెప్షన్‌ నుంచి ఆయనకు ఫోన్‌ చేయగా రూమ్‌కి రమ్మన్నారని తెలిపారు. దాంతో తాను కొంత సమయం ఆలోచనలో పడ్డానని. ఎందుకంటే సినిమా ఆఫర్‌ ఇస్తానంటూ ఎవరైనా మన వద్దకు వచ్చినా.. లేక మనం ఎవరి వద్దకైనా వెళ్లినా అందరికీ కనిపించేలా బయట మాత్రమే కూర్చోవాలని, రూమ్స్‌కి మాత్రం వెళ్లకూడదని మొదట్లోనే నిర్ణయించుకున్నానని అన్నారు. కానీ మంచి సినిమాలో ఆఫర్‌ పోతుందేమోనని భావించి చివరికి హోటల్‌లో ఆయన ఉంటున్న గదికి వెళ్లానంటూ నీనా చెప్పుకొచ్చారు. ఆయన తన గురించి గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించారని నీనా తెలిపారు. అయితే వెంటనే‘సర్‌.. ఇంతకీ మీ సినిమాలో ఎలాంటి పాత్ర ఇస్తున్నారు?’ అని ప్రశ్నించానని అన్నారు. దానికి ఆయన హీరోయిన్ ఫ్రెండ్‌ రోల్‌ అని బదులిచ్చారట. ఆయన వివరించిన దానిని బట్టి.. సినిమాలో ఆ పాత్రకు అంత ప్రాముఖ్యం లేదనిపించడంతో అక్కడి నుంచి బయలు దేరడానికి సిద్ధమయ్యానని నీనా పేర్కొన్నారు. ‘ఇక నేను బయలుదేరతాను సర్‌’ అని చెప్పగానే.. ‘ఏంటి.. నువ్వప్పుడే వెళ్లిపోతున్నావా?ఈ రాత్రికి ఇక్కడే ఉంటావని భావించాను’ అని సదరు నిర్మాత అన్నాడట. ఆ మాటతో తాను షాక్‌ తిన్నానని, భయం వేసిందంటూ నీనా చెప్పుకొచ్చారు. కంగారుగా అనిపించిందని నీనా తెలిపారు. దీంతో ఆయన తన హ్యాండ్‌బ్యాగ్‌ చేతికందించి.. ‘బలవంతం ఏమీ లేదు. నీకిష్టమైతే ఉండు. లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని అన్నాడట. అలా, తాను అక్కడి నుంచి బయటపడ్డానని తన ఆత్మకథలో క్లుప్తంగా రాసుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vDfdd9

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts