మెగాస్టార్ ఆపద్బాంధవుడన్న సంగతి తెలిసిందే. ఆపదలో ఉన్నారని తన కంట పడితే చేతనైన సాయం చేస్తుంటారు చిరంజీవి. సినీ పరిశ్రమకు కష్టాలు వచ్చిన ప్రతీ సమయంలో ముందుంటారు. గత ఏడాది కరోనాతో సినీ శ్రామికులు అల్లాడుతున్న సమయంలీ సీసీసీని ఏర్పాటు చేశారు. కరోనా క్రైసిస్ చారిటీ అంటూ ఇతర హీరోలనూ విరాళాలు ఇచ్చేలా ఎంకరేజ్ చేశారు. అలా గత ఏడాది ఎంతో మంది ఆకలిని తీర్చారు. ఇక ఈ సెకండ్ వేవ్‌లోనూ తన దైన శైలిలో సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారని తెలుసుకున్న చిరంజీవి అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్న వారు వాటిని వినియోగించుకోవచ్చని అన్నారు. ఇక ఇప్పుడు చిరంజీవి మరో ముందడుగు వేశారు. రాష్ట్రంలో అంబులెన్స్ కొరత ఉందన్న సంగతి చిరంజీవి దృష్టికి వెళ్లింది. చిరంజీవి ప్రస్తుతం అంబులెన్స్ సర్వీసులను స్టార్ట్ చేయబోతున్నారు. అపోలో హాస్పిటల్స్ సహా ఇతర ప్రైవేటు హాస్పిటల్స్ సహకారంతో ఈ సేవలను అందించడానికి చిరంజీవి సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అపోలో ఆధ్వర్యంలో సినీ పరిశ్రమతో మమేకమైన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్స్ వేయించిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి చేస్తోన్న ఈ సేవా కార్యక్రమాలతో అభిమానులే కాకుండా సాధారణ జనం కూడా చిరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాను పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3viNy0O
No comments:
Post a Comment