తెలుగు తెరపై క్రేజీ జోడీగా గుర్తింపు పొందారు విజయ్ దేవరకొండ- . 'గీతగోవిందం' సినిమాలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి ఆకట్టుకున్న వీళ్ళు 'డియర్ కామ్రెడ్' మూవీతో మరోసారి అట్రాక్ట్ చేశారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి సూపర్ సక్సెస్ అందుకోవడమే గాక ప్రేక్షకుల చేత పర్ఫెక్ట్ పెయిర్ అనిపించుకున్నారు. దీంతో ఆ మధ్య విజయ్ దేవరకొండ- రష్మిక జోడీ గురించిన కొన్ని ఊహాగానాలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ కొనసాగుతుందనే న్యూస్ వైరల్ అయింది. నటుడు రక్షిత్ శెట్టితో రష్మిక మందన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడానికి విజయ్ దేవరకొండనే కారణం అనే రూమర్లు సైతం వినిపించడంతో విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే ఇవేవీ పెద్దగా పట్టించుకోని ఈ జోడీ.. ఎవరి ప్రాజెక్ట్స్‌తో వారు బిజీ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' మూవీ చేస్తుండగా.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమాలో నటిస్తోంది రష్మిక. కాగా, తాజాగా ఈ ఇద్దరూ ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్ స్పాట్ వద్ద కెమెరాకు చిక్కడంతో విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఎఫైర్ తాలూకు విషయాలు మరోసారి చర్చల్లో నిలిచాయి. ముంబైలోని ఓ స్టార్ హోటల్లో డిన్నర్‌కు వెళ్లిన ఈ క్రేజీ సెలబ్రిటీలు తొడలు కనిపించే నిక్కర్లతో కనిపించడమే గాక రష్మిక చేతిలో ఫ్లవర్ బొకే ఉండటంతో ఇష్యూ వైరల్‌గా మారింది. సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న `మిషన్ మజ్ను` సినిమాతో రష్మిక బాలీవుడ్‌కు పరిచయం కానున్న నేపథ్యంలో రష్మిక చేరుకుంది. కొన్ని రోజులుగా అక్కడే విజయ్ దేవరకొండ 'లైగర్' షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే షూటింగ్స్‌తో బిజీగా ఉన్నా కూడా ఇలా ఇద్దరూ ఓకే ప్లేస్‌లో కలవడంతో డేట్‌కి వెళ్లారని టాక్ నడుస్తోంది. మొత్తానికైతే విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PbYuyl
No comments:
Post a Comment