Naga Babu: అందుకే రోజాను కమెడియన్ అన్నా.. మా మధ్య విభేదాలంటూ తాజా ఇష్యూపై నాగబాబు షాకింగ్ రియాక్షన్

సినిమా సినిమానే రాజకీయం రాజకీయమే అంటూ రోజాను కమెడియన్ అని సంబోధించడంపై వివరణ ఇచ్చారు మెగా బ్రదర్ . జబర్దస్త్ జడ్జ్‌లుగా నాగబాబు- కాంబో సుదీర్ఘ ప్రయాణం కొనసాగించిన సంగతి మనందరికీ తెలుసు. తమపై జబర్దస్త్ కమెడియన్స్ ఎన్ని పంచులేసినా సరదాగా తీసుకుంటూ ఆ షోకి అమితమైన ప్రజాదరణ రావడంలో కీలక భూమిక పోషించారు. అయితే రీసెంట్‌గా మల్లెమాలతో తెగదెంపులు చేసుకొని సోషల్ మీడియాలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్న నాగబాబు.. రోజాపై చేసిన కామెంట్స్ జనాల్లో పలు చర్చలకు దారి తీశాయి. తాజాగా ఈ అంశంపై మరోసారి షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు మెగా బ్రదర్. ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్‌స్టా ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసిన మెగా బ్రదర్.. నెటిజన్లు అడిగిన అన్ని ప్రశ్నలపై స్పందించారు. ఈ క్రమంలో ''సార్ జబర్దస్త్‌లో మీ ఫేవరెట్ కమెడియన్ ఎవరు?'' అని ఓ నెటిజన్ ప్రశ్నించడంతో ఇంకెవరు జబర్దస్త్ జడ్జ్ సీటుపై కూర్చున్న 'రోజా' అంటూ ఆమె ఫొటో పోస్ట్ చేయడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. జబర్దస్త్‌లో అంతమంది కమెడియన్స్ ఉండగా నాగబాబు దృష్టి రోజాపై ఎందుకు పడిందనే కోణంలో జనం చర్చలు మొదలుపెట్టారు. దీంతో ఇది కాస్తా కొత్త కాంట్రవర్సీకి దారి తీసింది. ఈ నేపథ్యంలో తాజాగా అదే సోషల్ మీడియా వేదికగా మీమర్స్‌లో లైవ్‌లో ఇంటరాక్ట్ అయిన నాగబాబు.. ఈ కాంట్రవర్సీపై రియాక్ట్ అయ్యారు. కమెడియన్ అనగానే ఎవ్వరైనా గెటప్ శ్రీను లాంటి వాళ్ల పేర్లు చెబుతాను అని అనుకుంటారు. అందుకే వెరైటీగా ఉంటుందని, మీ లాంటి వాళ్లు (మీమర్స్) షాక్ అవుతారని రోజా పేరు చెప్పానంటూ నాగబాబు ఓపెన్ అయ్యారు. అంతేకాదు ఈ మధ్య ఆమె పంచులు కూడా బాగానే వేస్తున్నారు కాబట్టి అలా చెప్పానని తెలిపారు. ఇకపోతే తమ మధ్య కొంతమేర రాజకీయపరమైన విబేధాలున్నా వ్యక్తిగతంగా ఎలాంటి కాంట్రవర్సీలు లేవని మెగా బ్రదర్ క్లారిటీ ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3c9n384

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts